సొగసు చూడతరమా..

వాడిపోని పువ్వులు, రెక్కలొచ్చి ఎగిరిపోని పక్షులు చూసుంటామా? బాలా నివేత చేతులకి అలాంటి అద్భుతాలు సాధ్యమే. క్లిష్టమైన రష్యన్‌ స్కల్‌ప్చర్‌ ఆర్ట్‌ని రెండేళ్లు సాధన చేసి నేర్చుకున్నారామె. గడియారాలు, అద్దాల ఫ్రేమ్‌లు, కీహోల్డర్లు, స్టాండ్‌లు, చైన్‌ లాకెట్‌లు, పక్షులు ఒకటా, రెండా ఏదైనా సహజత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారామె.

Updated : 29 Jul 2023 16:08 IST

వాడిపోని పువ్వులు, రెక్కలొచ్చి ఎగిరిపోని పక్షులు చూసుంటామా? బాలా నివేత చేతులకి అలాంటి అద్భుతాలు సాధ్యమే. క్లిష్టమైన రష్యన్‌ స్కల్‌ప్చర్‌ ఆర్ట్‌ని రెండేళ్లు సాధన చేసి నేర్చుకున్నారామె. గడియారాలు, అద్దాల ఫ్రేమ్‌లు, కీహోల్డర్లు, స్టాండ్‌లు, చైన్‌ లాకెట్‌లు, పక్షులు ఒకటా, రెండా ఏదైనా సహజత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారామె. తమిళనాడుకు చెందిన బాలకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్‌పై మక్కువ. ఆ ఆసక్తితోనే జెంటాంగెల్‌, డీన్‌, జాజ్‌ యానిమేషన్‌, మ్యురల్‌, సీస్కేప్‌ పెయింటింగ్‌ లాంటివి నేర్చుకున్నారు. తన ప్రతిభకు దేశవిదేశాల్లో ఎన్నో బహుమతులు అందుకున్నారు. వేల మందికి పెయింటింగ్‌ పాఠాలు చెప్పారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో మాస్టర్స్‌ పూర్తిచేసిన బాల బొమ్మలు వేయడాన్ని మొదట్లో వ్యాపకంగా మొదలుపెట్టినా, ఇప్పుడు దాన్నే వ్యాపారంగా మలుచుకుని లక్షలు సంపాదిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్