డార్లింగ్స్‌... అది హింస!

ఇంట్లో వస్తువులు పగులుతున్న చప్పుడు. ఆ వెనకే అతని తిట్లు... దెబ్బలకు తాళలేని ఆమె అరుపులు. అయినా చుట్టుపక్కల వాళ్లు ఏమీ పట్టించుకోనట్లుగా తమ పని తాము చేసుకుపోతుంటారు.

Updated : 07 Mar 2024 12:37 IST

ఇంట్లో వస్తువులు పగులుతున్న చప్పుడు. ఆ వెనకే అతని తిట్లు... దెబ్బలకు తాళలేని ఆమె అరుపులు. అయినా చుట్టుపక్కల వాళ్లు ఏమీ పట్టించుకోనట్లుగా తమ పని తాము చేసుకుపోతుంటారు. అది వాళ్లకి కొత్తేమీ కాదు. మూడేళ్లుగా ఆ ఇంట్లో జరిగే తంతే ఇది. అన్నంలో రాయి తగిలినా, కూరలో కారం ఎక్కువైనా అతనికి కోపం నషాళానికి అంటేస్తుంది. మరి ఆ భార్య పరిస్థితేంటి? రాత్రంతా గొడ్డును బాదినట్లు బాదినా ఉదయాన్నే ‘క్షమించు... తాగిన మైకంలో అలా చేశా. ఇంకెప్పుడూ అలా చేయను’ అని భర్త అనగానే నిజమే అని నమ్మేస్తుంది. అతనికి కావాల్సినవన్నీ సమకూర్చిపెడుతుంది.

తల్లి, స్నేహితుడు అతనికి విడాకులు ఇమ్మని సలహానిస్తే ‘ఏ ఇంట్లో ఇలాంటి చిన్న గొడవలు ఉండవు’ అని తిరిగి ప్రశ్నిస్తుందామె. పైగా భర్తతో తాగుడు మాన్పించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంది. అయినా అతని తీరు మారదు. పైగా పెచ్చు మీరుతుంది. ఓసారి తట్టుకోలేక పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కినా భర్తమాటలు నమ్మి కేసు వెనక్కి తీసుకుంటుంది. కానీ ఆ తర్వాత భరించలేని స్థితికి చేరిన ఆమె ఏ నిర్ణయం తీసుకుందన్నదే ‘డార్లింగ్స్‌’ కథ. ఆలియా భట్‌, షెఫాలీ షా ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఆడవాళ్లపై జరిగే గృహహింసను చూపెడుతుంది. అందరూ భావిస్తున్నట్లుగా ఇది సహజం కాదు... హింసేనన్న అవగాహన కల్పిస్తుంది. సమాజం ఏమనుకుంటుందో, ఒంటరి మహిళకు విలువుండదంటూ భయపడుతూ హింసను భరించే ఆడవాళ్ల నిస్సహాయతను కళ్లకు కట్టడమే కాదు... దాన్నుంచి ధైర్యంగా బయటపడాలంటూ ప్రోత్సహిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్