టొమాటోకి బదులుగా!

టొమాటో ధరలు చుక్కలనంటాయి... ఇతర కూరగాయలూ చేతికందేలా లేవు... మరేం చేయాలి? రోజూ తినడానికి అలవాటైన వాటినే అచ్చంగా  వాడాలనేం లేదు. ప్రత్యామ్నాయాలు బోలెడున్నాయి.

Published : 29 Nov 2021 01:27 IST

టొమాటో ధరలు చుక్కలనంటాయి... ఇతర కూరగాయలూ చేతికందేలా లేవు... మరేం చేయాలి? రోజూ తినడానికి అలవాటైన వాటినే అచ్చంగా  వాడాలనేం లేదు. ప్రత్యామ్నాయాలు బోలెడున్నాయి.

ఉసిరి... ఈ కాలంలో ఎక్కువగా దొరికే వీటిని టొమాటాలకు బదులుగా వాడేసుకోవచ్చు. అయితే ఇవి పులుపుతోపాటు కొద్దిగా వగరుగానూ ఉంటాయి. కాబట్టి కూరలో వేసుకునేటప్పుడు తగిన మోతాదులోనే తీసుకోవాలి. కొన్ని నీళ్లలో కాస్తంత చక్కెర వేసి అందులో ఈ ఉసిరి ముక్కలను నానబెట్టాలి. ఆ తర్వాత మెత్తగా రుబ్బుకొని ఆ పేస్ట్‌ని కూరల్లో వాడుకుంటే సరిపోతుంది.

ఆమ్‌చూర్‌... ఇది టొమాటోల్లా పుల్లపుల్లగా... తియ్యతియ్యగా ఉంటుంది. ధర కూడా తక్కువే. కాబట్టి టొమాటోకి బదులుగా ఆమ్‌చూర్‌ను ఎంచుకోండి మరి. రుచి కోసం కూరల్లో ఓ చెంచా మామిడికాయల పొడిని కలిపి చూడండి.

చింతపండు...  గుజ్జును కూడా వీటికి బదులుగా వాడుకోవచ్చు. చింతపండును నీళ్లలో నానబెట్టి పావుగంట తర్వాత రసం తీసి వాడుకుంటే సరి. చిక్కగా ఉందనుకుంటే కొన్ని నీళ్లు పోసుకుని వడగట్టుకోవాలి. దీన్ని కూరలు, చారుల్లో వాడుకుంటే పుల్లదనంతోపాటు రుచి పెరుగుతుంది.

పెరుగు... పుల్లటి పెరుగు కూరగాయలకు పట్టిస్తే టొమాటో రుచిని అందజేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్