మీ వార్డ్‌రోబ్‌ పర్యావరణహితమా...

కనిపించిన దుస్తులను కొనడం లేదా ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్‌తో వాకిట్లోకి తెప్పించుకోవడం ఇప్పుడు సర్వసాధారణం. కానీ వాటిని ఎంతవరకు వినియోగిస్తాం అనేది సందేహమే. నిండిన వార్డ్‌రోబ్‌లో వృథాగా మిగిలేవే ఎక్కువ

Published : 30 Apr 2022 02:14 IST

కనిపించిన దుస్తులను కొనడం లేదా ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్‌తో వాకిట్లోకి తెప్పించుకోవడం ఇప్పుడు సర్వసాధారణం. కానీ వాటిని ఎంతవరకు వినియోగిస్తాం అనేది సందేహమే. నిండిన వార్డ్‌రోబ్‌లో వృథాగా మిగిలేవే ఎక్కువ. దుస్తుల విషయంలో మీరేం చేస్తున్నారన్న దాన్ని బట్టి మీ వార్డ్‌రోబ్‌ ఎంత వరకూ పర్యావరణహితంగా ఉందో  తెలుసుకోవచ్చు.

ముప్పైసార్లు... బాగా నచ్చిన దుస్తులనైనా కొనే ముందు ఒక్కసారైనా ‘వీటిని కనీసం 30 సార్లు అయినా ధరిస్తానా’ అని ఆలోచించాలి. సమాధానం కాదనిపిస్తే కొనడానికి నో చెబుతున్నారా... అయితే మీ వార్డ్‌రోబ్‌ పర్యావరణహితమే.
ఇతరులకు ఇచ్చేస్తుంటే... తరచూ ధరించని, రంగు పోయి లేదా కొన్న తర్వాత నచ్చని దుస్తులను వృథాగా వదిలేయకుండా వాటిని రీసైకిల్‌ చేయడం మంచిది. ఎవరికైనా ఇచ్చేస్తున్నట్లైతే పర్యావరణానికి మీరు అంతగా హాని చేయనట్లే.

నిర్వహణ.. దుస్తుల రకాలను బట్టి వాటిని సంరక్షించాలి. అన్నింటినీ ఒకేలా శుభ్రం చేయడం సరైన పద్ధతి కాదు. అన్నింటినీ కుక్కేయడం కూడా మంచిది కాదు. టాప్స్‌, బాటమ్స్‌, చున్నీలు, లోదుస్తులంటూ సీజన్లకు తగినట్లుగా సర్దుకుంటున్నారంటే మీ వార్డ్‌రోబ్‌ పర్యావరణహితమే. పాత, కొత్త వాటిని మిస్‌మ్యాచ్‌ చేసినా కూడా దుస్తులు వృథా కానట్లే.
ఏడాదంతా... కాలాలతో పనిలేకుండా ఏడాదంతా ధరించే కొన్ని రకాలను కొనుగోలు చేయాలి. టీ-షర్ట్‌లు, అన్నింటికీ మ్యాచ్‌ అయ్యే బ్లేజర్లు, క్లాసిక్‌ ప్యాంట్లు వంటివి ఉంటే ఏ కాలంలోనైనా వినియోగించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్