అవి... ఆరోగ్యమేనా?

పెరుగుతున్న కాలుష్యం.. ఆరోగ్యంపై శ్రద్ధ.. కారణాలు ఏవైనప్పటికీ ప్రకృతిని ఆశ్రయిస్తున్నవారే ఎక్కువ. ఇంటిలోనూ మొక్కలకు చోటిచ్చేస్తున్నారు. మరి మన ఆరోగ్యాన్ని రక్షిస్తున్న వాటి బాగోగులను పట్టించుకోవాలి కదా!

Updated : 11 Mar 2024 14:22 IST

పెరుగుతున్న కాలుష్యం.. ఆరోగ్యంపై శ్రద్ధ.. కారణాలు ఏవైనప్పటికీ ప్రకృతిని ఆశ్రయిస్తున్నవారే ఎక్కువ. ఇంటిలోనూ మొక్కలకు చోటిచ్చేస్తున్నారు. మరి మన ఆరోగ్యాన్ని రక్షిస్తున్న వాటి బాగోగులను పట్టించుకోవాలి కదా! అందుకు సాయపడే చిట్కాలివీ...

  • మనీప్లాంట్‌, స్నేక్‌ప్లాంట్‌.. ఇలా కొన్ని ఇండోర్‌ మొక్కలకు ఎగిరే పురుగులు పెద్ద శత్రువులు. ఈ బగ్స్‌ నుంచి వాటిని రక్షించాలంటే.. కొన్ని నీటిలో ఐదారు వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టి వేయాలి. గంట తర్వాత సమస్య ఉన్న మొక్కలపై ఆ నీటిని ఆకులు మాత్రమే తడిచేలా పిచికారీ చేయాలి. వెల్లుల్లి ఘాటు ఈ పురుగులను మొక్కల దరిచేరనీయకపోవడమే కాదు, ఇతర చీడపీడల నుంచీ రక్షిస్తుంది.
  • వేసవి ప్రభావం ఇంట్లో పెరిగే మొక్కలపైనా ఉంటుంది. అలాగని ఒకేసారి ఎక్కువ నీరు పోద్దామంటే కుదరదు. పొరపాటున మర్చిపోతే మొక్క చనిపోయే ప్రమాదం. ఇలాంటప్పుడు ఒక సీసాను నీటితో నిండుగా నింపేయండి. దానిలో ఊలు దారాన్నో, పొడవైన వస్త్రాన్నో తీసుకొని దాని చివర్లో ఒక మేకును కట్టి నీళ్ల సీసాలో వేయాలి. మరోవైపు కొసకు టూత్‌పిక్‌ను చుట్టి మొక్క ఉండే కుండీలో గుచ్చితే సరి. సీసాలోని నీరు కొద్దికొద్దిగా మొక్కకు అంది, ఆరోగ్యంగా పెరుగుతుంది.
  • ఎన్ని జాగ్రత్తలు పాటించినా మనం అనారోగ్యాలకు గురవుతూనే ఉంటాం. మొక్కలూ అంతే! అలాంటప్పుడు బేకింగ్‌ సోడా సాయం తీసుకోండి. చెంచా బేకింగ్‌ సోడాను బకెట్‌ నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని మొక్క మొదట్లో కొద్దికొద్దిగా వారానికో, నెలకోసారో అందిస్తే సరి. ఇది మట్టిలో ఉండే పీహెచ్‌ స్థాయుల్ని కాపాడి, మొక్క అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్