గిన్నె మాడిందా...

వంటచేసేటప్పుడు కొన్నిసార్లు పాత్రలు మాడిపోవడం సహజం. ఇవి ఓ పట్టాన వదలవు కూడా. ఈ చిట్కాలతో వాటిని మెరిసేలా చేసేయొచ్చిలా...

Published : 12 Mar 2024 01:15 IST

వంటచేసేటప్పుడు కొన్నిసార్లు పాత్రలు మాడిపోవడం సహజం. ఇవి ఓ పట్టాన వదలవు కూడా. ఈ చిట్కాలతో వాటిని మెరిసేలా చేసేయొచ్చిలా...

  • నిమ్మలోని ఆమ్లాలకు మరకల్ని తొలగించే గుణం ఉంది. నిమ్మచెక్కను ఉప్పులో అద్ది...  నానబెట్టిన పాత్రను రుద్దాలి. మాడు మరకలు సులభంగా వదిలిపోతాయి.
  • బేకింగ్‌ సోడాను నీటిలో కలిపి పేస్టులా చేసుకోవాలి. దాన్ని మాడిన గిన్నెలకు పట్టించి పది నిమిషాల తరవాత శుభ్రం చేస్తే మరకలు వదులుతాయి.
  • మాడిన గిన్నెను స్టౌవ్‌ మీద పెట్టి అందులో నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి అది కరిగే వరకూ మరిగించాలి. తరవాత స్క్రబ్బర్‌తో రుద్దితే మాడిన మరకలు కనిపించవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్