ఆ సీక్రెట్‌ ఏంటో తెలుసా...

స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన జ్యోతిక.. కొన్నాళ్లు సినిమాలకు దూరమై... ఈ మధ్యే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో రీఎంట్రీ ఇచ్చింది. దాంతో ఇటీవల ఆమె వర్కవుట్‌ వీడియోలూ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Updated : 23 Mar 2024 14:08 IST

స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన జ్యోతిక.. కొన్నాళ్లు సినిమాలకు దూరమై... ఈ మధ్యే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో రీఎంట్రీ ఇచ్చింది. దాంతో ఇటీవల ఆమె వర్కవుట్‌ వీడియోలూ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇన్నేళ్లైనా అందం ఏమాత్రం తగ్గకుండా నాజుగ్గా ఉండడానికి కారణమేంటి? మీ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటీ అంటూ కొందరు నెటిజన్స్‌ అడుగుతున్నారు. ఆ రహస్యమేంటో తెలుసుకుందామా...

  • రన్నింగ్‌కు వెళ్తుందట. కాకపోతే చుట్టుపక్కల స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఉండే ప్రాంతాలనే ఎంపిక చేసుకుంటుంది. జిమ్‌కి వెళ్లి వెయిట్‌లిఫ్టింగ్‌, రోప్‌ ట్రైనింగ్‌ వంటివి చేస్తూ శరీరాన్ని నాజుగ్గా ఉంచుకుంటుంది. అంతేకాదు మానసిక ప్రశాంతత కోసం స్పా లేదా స్విమ్మింగ్‌లను ఎక్కువగా ఇష్టపడుతుంది. చర్మం తాజాగా కనిపించడానికి రోజూ కొబ్బరి నీళ్లు, గ్రీన్‌ టీ వంటివి తాగుతుంది.
  • ఇక ఆహారం విషయానికి వచ్చేసరికి బయట ఫుడ్‌కు దూరంగా ఉంటూ, తక్కువ కెలోరీలు ఉండే భోజనం తీసుకుంటానని చెబుతోంది జ్యోతిక. పండ్లు, కూరగాయలతో చేసిన సలాడ్స్‌ని తప్పనిసరిగా తీసుకుంటుంది. ఈ అలవాట్లు తనని ఆరోగ్యంగానే కాదు అందంగానూ ఉంచుతాయని అంటోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్