నూరేళ్లు కలిసిమెలిసి...

అర్ధశతాబ్దం కలిసి జీవించిన జంటకు చేసే షష్టిపూర్తి పండుగ చూడముచ్చటగా ఉంటుంది. ఆ ఇరువురి అనుబంధం అద్భుతంగా అనిపిస్తుంది. ఆ జంట అలా నూరేళ్లూ ఉండాలని అందరం కోరుకుంటాం.

Updated : 28 Dec 2021 06:00 IST

అర్ధశతాబ్దం కలిసి జీవించిన జంటకు చేసే షష్టిపూర్తి పండుగ చూడముచ్చటగా ఉంటుంది. ఆ ఇరువురి అనుబంధం అద్భుతంగా అనిపిస్తుంది. ఆ జంట అలా నూరేళ్లూ ఉండాలని అందరం కోరుకుంటాం. అలాంటి బంధాన్ని కోరుకునే వారు ఎలా మెలగాలో నిపుణులు సూచిస్తున్నారు.

దంపతుల మధ్య శారీరక బంధంలాగే మానసిక బంధం కూడా చాలా విలువైంది. ఎదుటివారిని ప్రేమించడం, వారి ప్రేమను పొందడం రెండూ ముఖ్యమే. వివాహమైన మరుక్షణం నుంచి ఇరువురి మధ్య ఏర్పడే ప్రేమైక బంధం రోజురోజుకీ బలపడేలా ఇద్దరూ ప్రయత్నించాలి. భార్యా భర్తల్లాగానే కాకుండా స్నేహితుల్లా, ప్రేమికుల్లా మెలగాలి. ఒకరిపై మరొకరి మర్యాద ఇద్దరినీ ప్రేమలో పడేస్తుంది. ఇదే శాశ్వతబంధంగా మారుతుంది.

అర్థం చేసుకోవాలి... జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. జీవితమంతా కలిసి ఉండాల్సిన వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిదీ. కుటుంబ, వ్యక్తిగతానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఇద్దరూ చర్చించుకొని ఏకాభిప్రాయంతో తీసుకోవాలి. ఒకరికి ఆమోదం లేకపోయినా వారికి వివరించడానికి ప్రయత్నించాలి.

సర్దుకుపోవాలి...  ఎదురయ్యే సమస్యలను భార్యా భర్తలిద్దరూ కలిసి పరిష్కరించు కోవాలి. అలాగే ఇరువురి మధ్య ఏర్పడే చిన్నచిన్న గొడవలకు సర్దుకుపోవడం ఇద్దరూ నేర్చుకోవాలి. ఒకరికి కోపం ఉంటే, మరొకరు శాంతంగా ఉండగలగాలి. దంపతుల మధ్య ఏర్పడే చిన్న గొడవలపై చర్చించడానికి మూడో వ్యక్తికి ఆస్కారం ఇవ్వకుండా, మృదువుగా ఆ ఇరువురే చర్చించుకుంటే చాలు, ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కారమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్