ఒంటరి మహిళల... ఊరు!

అల్‌ సమాహ్‌.. ఈ గ్రామంలో ఒంటరి మహిళలు మాత్రమే ఉంటారు. మగవాళ్లకి ప్రవేశం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సిందే. అలాగని ఆ ఊరు పెళ్లిళ్లకు వ్యతిరేకం కాదు. ఈజిప్ట్‌లోని కైరో నగరానికి దగ్గరగా ఉండే ఈ ఊరిని 1998లో వితంతు మహిళల కోసం కేటాయించింది అక్కడి ప్రభుత్వం.

Updated : 06 Mar 2024 12:47 IST

మహిళా లోకం

అల్‌ సమాహ్‌.. ఈ గ్రామంలో ఒంటరి మహిళలు మాత్రమే ఉంటారు. మగవాళ్లకి ప్రవేశం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సిందే. అలాగని ఆ ఊరు పెళ్లిళ్లకు వ్యతిరేకం కాదు. ఈజిప్ట్‌లోని కైరో నగరానికి దగ్గరగా ఉండే ఈ ఊరిని 1998లో వితంతు మహిళల కోసం కేటాయించింది అక్కడి ప్రభుత్వం. భర్త చనిపోయి, సంపాదన లేక... కొడుకుల మీద ఆధారపడలేని ఆడవాళ్ల కోసం కొంత స్థలాన్ని కేటాయించారు అధికారులు. సాగు చేసుకోవడానికి భూమినీ ఇచ్చారు. అలా అక్కడి మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేవారు. క్రమంగా భర్త నుంచి విడాకులు తీసుకున్నవాళ్లూ, గృహహింస బాధితులు కూడా వచ్చి ఆ ఊళ్లో ఆశ్రయం పొందేవారు. వీరంతా వ్యవసాయం, పశువుల పెంపకం, చేతివృత్తుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఈ ఊళ్లో మగవాళ్లు అడుగుపెట్టడానికి వీళ్లేదు. ప్రభుత్వమే రక్షణ చర్యలు కూడా తీసుకుంటుంది. ఒకవేళ ఎవరికైనా తోడు దొరికితే అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సిందే. వందల మంది మహిళలు అక్కడ ఒకరికొకరు తోడుగా, ధైర్యంగా జీవనం సాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్