ఆ వివరాలు నీకెందుకూ అంటున్నాడు!

నా వయసు 28... పెళ్లైంది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఆయన జీతంతో పోలిస్తే నా జీతం తక్కువ. అయితే ఇంటికి సంబంధించిన ఖర్చంతా నాతోనే పెట్టిస్తాడు. కానీ తన జీతం గురించిన వివరాలు మాత్రం చెప్పడు. అడిగితే నేను పొదుపు చేస్తున్నా, ఆ వివరాలు నీకెందుకూ అంటాడు. ఇలానే కొనసాగితే నా భవిష్యత్‌ ఏమవుతుందో అని ఆందోళనగా ఉంది. నేనేం చేయాలి?

Updated : 26 Feb 2024 15:14 IST

నా వయసు 28... పెళ్లైంది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఆయన జీతంతో పోలిస్తే నా జీతం తక్కువ. అయితే ఇంటికి సంబంధించిన ఖర్చంతా నాతోనే పెట్టిస్తాడు. కానీ తన జీతం గురించిన వివరాలు మాత్రం చెప్పడు. అడిగితే నేను పొదుపు చేస్తున్నా, ఆ వివరాలు నీకెందుకూ అంటాడు. ఇలానే కొనసాగితే నా భవిష్యత్‌ ఏమవుతుందో అని ఆందోళనగా ఉంది. నేనేం చేయాలి?

ఓ సోదరి

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నప్పుడు అది కుటుంబ ఆదాయం అవుతుంది. దానిపై ఇద్దరికీ సమాన హక్కు, బాధ్యత ఉంటాయి. కాబట్టి దాన్ని ఏ విధంగా ఖర్చుపెట్టాలీ, ఆదా చేయాలీ అనేది ఇద్దరూ కలిసి నిర్ణయించాల్సి ఉంటుంది. ఇందులో రహస్యాలు ఉండకూడదు. ఒకరిమీద ఒకరికి నమ్మకం ఉండాలి. మీరు డబ్బుని ఇంటి అవసరాలకు ఖర్చు చేస్తున్నారు ఫర్వాలేదు. కానీ అతను తన డబ్బుని ఏ విధంగా ఖర్చు చేస్తున్నాడో చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. అతను పొదుపు చేసినప్పటికీ, ఆ వివరాలు చెప్తే, మీలో అభద్రతాభావం ఉండదు. కుటుంబ భవిష్యత్తు గురించి మీకూ ధైర్యం ఉంటుంది. అన్నీ తనే చేయాలనో, లేదా ఆడవాళ్లకు ఆర్థిక విషయాలు తెలీదన్న అపోహ కూడా అతనికి ఉండి ఉండొచ్చు. ప్రశ్నిస్తున్నట్లు కాకుండా, తను ఏ విధంగా ఆదా చేస్తున్నారో చెప్పమని సామరస్యంగానే అడగండి. ఇద్దరికీ ఇంటి విషయాలు తెలిస్తేనే సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించగలుగుతాం అని చెప్పండి. సమయం ఇచ్చి చూడండి. అప్పటికీ ఒకవేళ అతను చెప్పకుండా మొండివైఖరితో ఉంటే, మీరు సంపాదిస్తున్నదాన్నే పొదుపు చేసేటట్లు, అతనే ఇంటి బాధ్యతలు చూసుకునేట్లు ఒప్పించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్