జుట్టు ఊడిపోకుండా..!

నల్లటి వాలు కురులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే ప్రస్తుతం రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం కురుల మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే జుట్టు వూడిపోవడం, పలుచగా అయిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

Published : 03 Jan 2024 12:49 IST

నల్లటి వాలు కురులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే ప్రస్తుతం రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం కురుల మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే జుట్టు వూడిపోవడం, పలుచగా అయిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి తోడు మనం స్త్టెలింగ్ కోసం ఉపయోగించే ఉత్పత్తులు కూడా కేశాలను నిర్జీవంగా మార్చేస్తున్నాయి. మరి, వీటికి పరిష్కారం ఏమిటి? ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చక్కటి కేశసంపదను సొంతం చేసుకోవడం ఎలా?..

కెమికల్స్‌కి దూరంగా..

జుట్టు ఎదగడానికి అవసరమయ్యే పోషకాలను ఎప్పటికప్పుడు ఆహారం ద్వారానే కాకుండా బయట నుంచి కూడా అందిస్తూ ఉండాలి. అలాగే జుట్టు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా తప్పనిసరి. అంటే దుమ్ము, ధూళి, చుండ్రు.. ఇలాంటివేవీ లేకుండా జాగ్రత్తపడాలి. తలస్నానం చేసేటప్పుడు కూడా ఎంతమేరకు షాంపూ అవసరమో అంతే వినియోగించాలి. అయితే వీటిలో సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి. లేదంటే అవసరానికి మించి షాంపూ ఉపయోగించినప్పుడు దాని ప్రభావం జుట్టు మీద తప్పకుండా కనిపిస్తుంది. అందుకే రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తుల్ని ఎంత తక్కువ వాడితే జుట్టుకి అంత శ్రేయస్కరం.

తొందరగా ఆరాలని..

ఆఫీసుకి టైం అవుతోందనో, కాలేజీ బస్సు మిస్సవుతుందనో జుట్టు త్వరత్వరగా ఆరిపోవాలని డ్రయర్లు వాడుతూ ఉంటాం. అయితే వీటివల్ల అప్పటికప్పుడు జుట్టు ఆరిపోయి సమస్య పరిష్కారం అయిపోయినా.. అవి కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. అలాంటి ఉత్పత్తుల ద్వారా విడుదలయ్యే వేడి జుట్టుని మరింత బలహీనపరుస్తుంది. ఇక, తల దువ్వేటప్పుడు వెంట్రుకలు సగంలో తెగిపోవడం లేదా మొత్తానికి వూడిపోవడం జరుగుతుంది. కాబట్టి డ్రయర్లు, కర్లర్స్, స్ట్రెయిటనర్స్.. మొదలైన ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

జుట్టుని బిగుతుగా కట్టొద్దు..

కాలేజ్‌కు వెళ్లే అమ్మాయిలు లేదా ఆఫీసుకు వెళ్లే మహిళలు స్త్టెల్‌గా కనిపించడానికో లేక సమయాభావం వల్లనో ఎక్కువగా పోనీటెయిల్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ జుట్టంతా అలా బిగుతుగా లాగి బ్యాండ్ పెట్టడం వల్ల అవి కుదుళ్లలో చాలా బలహీనంగా అయిపోతాయి. జుట్టుపై ఒత్తిడి పెరిగి తెగిపోతుంది. కాబట్టి జుట్టుని సాధ్యమైనంత వరకు వదులుగానే ఉంచాలి. అలా వదులుగా ఉండే హెయిర్‌స్త్టెల్స్ ప్రయత్నించడమే ఉత్తమం.

చివర్లు ట్రిమ్ చేయాలి..

జుట్టు చివర్లను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి. కానీ, అలా కత్తిరించడం వల్ల జుట్టు పెరగదేమోనని చాలామంది అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. జుట్టుని తరచుగా ట్రిమ్ చేస్తూ ఉండటం వల్ల చివర్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టుకు అవసరమయ్యే పోషణ సులభంగా అంది, ఎదుగుదల బాగుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్