అందానికి ‘ఐస్‌ గ్లోబ్స్‌’!

ఉదయం నిద్ర లేవగానే ముఖం ఉబ్బిపోతుంటుంది చాలామందికి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, డీప్‌ ఫ్రైడ్‌ పదార్థాలు తీసుకోవడంతో పాటు నిద్ర సరిపోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంటుంది.

Published : 18 Nov 2023 18:42 IST

ఉదయం నిద్ర లేవగానే ముఖం ఉబ్బిపోతుంటుంది చాలామందికి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, డీప్‌ ఫ్రైడ్‌ పదార్థాలు తీసుకోవడంతో పాటు నిద్ర సరిపోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంటుంది. ఇలాంటప్పుడు ఐస్‌ వాటర్‌లో కాసేపు ముఖాన్ని ముంచి ఉంచడం, ఐస్‌ ముక్కలతో ముఖానికి మర్దన చేసుకోవడం మనకు అలవాటు! అయితే వీటి కంటే సులువుగా ముఖానికి ఐస్‌ థెరపీ చేసుకునే గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవే ‘ఐస్‌ గ్లోబ్స్‌’.

పేరుకు తగ్గట్లే ఒకవైపు గ్లోబ్‌లా, మరోవైపు పట్టుకోవడానికి హ్యాండిల్‌తో కూడిన వీటిని గాజు, స్టీల్‌.. వంటి మెటీరియల్స్‌తో తయారుచేశారు. అలాగే గ్లోబ్‌లా ఉన్న భాగం గుండ్రంగా తిరిగే విధంగా ఉంటుంది. ఇక వీటి లోపల ఒక రకమైన ద్రావణాన్ని నింపి తయారుచేశారు. అయితే వీటిని ఉపయోగించాలంటే అరగంట పాటు డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టేయాలి.. ఉదయాన్నే ఉపయోగించాలనుకునే వారు రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టేయచ్చు. తద్వారా అందులోని ద్రావణం ఐస్‌లా మారిపోతుంది. దీనివల్ల గ్లోబ్‌ ఎక్కువ సేపు చల్లగా ఉంటుంది.

ఇప్పుడు ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని.. కొన్ని చుక్కల ఏదైనా ఎసెన్షియల్‌ ఆయిల్‌/క్రీమ్‌/సీరమ్‌ రాసుకోవాలి. ఆపై హ్యాండిల్‌ ఉన్న వైపు చేత్తో పట్టుకొని.. గ్లోబ్‌ను ముఖంపై ఉంచి.. కింది నుంచి పై దిశగా మర్దన చేయాలి. ఇలా గడ్డం, బుగ్గలు, నుదురు, మెడ వద్దే కాదు.. ఇతర శరీర భాగాల్లోనూ దీంతో మసాజ్‌ చేసుకోవచ్చు. ఫలితంగా ముఖంపై రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.. తద్వారా ఉబ్బిన ముఖం సాధారణ స్థితికి రావడంతో పాటు ముఖంపై ముడతలు/గీతలు.. వంటివేవైనా ఉన్నా తొలగిపోతాయి. అంతేకాదు.. చర్మ స్థితిస్థాపకత కూడా పెరుగుతుంది. ఇలా అందాన్ని ద్విగుణీకృతం చేసే ఐస్‌ గ్లోబ్స్‌ ప్రస్తుతం విభిన్న రంగుల్లో దొరుకుతున్నాయి.

ఇవే కాకుండా.. ఐస్‌ రోలర్స్‌ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. సిలికాన్‌తో తయారుచేసిన వీటిలో రోజ్‌ వాటర్‌, నిమ్మరసం, కీరాదోస నీళ్లు, గ్రీన్‌ టీ, కొబ్బరి పాలు.. వంటివి పోసి రాత్రంతా డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టేయాలి. తద్వారా ఆ నీళ్లు గడ్డకట్టుకుపోతాయి. ఆపై పై భాగాన్ని ఓపెన్‌ చేసి.. మర్దన చేసుకోవచ్చు. పట్టుకోవడానికి సిలికాన్‌ హ్యాండిల్‌ ఉంటుంది కాబట్టి చల్లదనం చేతులకు తగలకుండా జాగ్రత్తపడచ్చు. భలే ఉన్నాయి కదూ.. ఈ ఐస్‌ గ్లోబ్స్‌, ఐస్‌ రోలర్స్‌!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్