చిట్టి రోలుకో చిన్ని మూత!

ఎక్కువ మొత్తంలో మసాలా దినుసులు, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌, ఇతర పొడుల్ని తయారుచేసుకోవడానికి చాలామంది మిక్సీ వాడడం తెలిసిందే! అయితే ఒక్కోసారి వీటిని తక్కువ మొత్తంలో తయారుచేయాల్సి రావచ్చు.. అప్పటికప్పుడే దంచుకొని వంటల్లో వినియోగించుకునే వారూ ఉంటారు.

Published : 19 Jan 2024 12:13 IST

ఎక్కువ మొత్తంలో మసాలా దినుసులు, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌, ఇతర పొడుల్ని తయారుచేసుకోవడానికి చాలామంది మిక్సీ వాడడం తెలిసిందే! అయితే ఒక్కోసారి వీటిని తక్కువ మొత్తంలో తయారుచేయాల్సి రావచ్చు.. అప్పటికప్పుడే దంచుకొని వంటల్లో వినియోగించుకునే వారూ ఉంటారు. ఇలాంటి వారు చిన్న సైజు రోలు-రోకలిని ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుంటారు. అయితే ఇందులో ఆయా పదార్థాల్ని దంచేటప్పుడు అవి ఎగిరి పక్కకు పడిపోవడం, తద్వారా రోలు చుట్టూ ఉన్న ప్రదేశం చిందరవందరగా మారిపోవడం చాలామందికి అనుభవమే! ఇలా దంచడం ఒకెత్తయితే.. ఆపై ఈ చుట్టూ పడిపోయిన వాటిని శుభ్రం చేయడం మరో ఎత్తు! ఇకపై ఈ సమస్య రాకుండా ఉండడానికే మూతలతో కూడిన రోళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు నిపుణులు.

రాయితో పాటు స్టీల్‌, వెదురుతో తయారుచేసిన చిన్న రోళ్లు ఇప్పుడు చాలామంది ఇంట్లో ఉపయోగిస్తున్నారు. ఇలా ఆయా రోళ్లకు సరిపడేలా మూతల్నీ డిజైన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రోకలి పట్టేంత భాగం మూతకు మధ్యలో రంధ్రం చేసి అందిస్తున్నారు. ముందుగా రోట్లో కావాల్సిన పదార్థాలు వేసి.. రోకలిని ఉంచి.. దానిపై నుంచి మూతను బిగించుకోవాల్సి ఉంటుంది.. ఆపై మూత పట్టుకొని రోకలితో దంచడం వల్ల ఆయా పదార్థాలు బయటికి చిట్లకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఈ మూతలు సిలికాన్‌, వెదురుతో తయారుచేయడం వల్ల రోకలి రోట్లో సులువుగా కదిలేందుకు అనువుగా కూడా ఉంటుంది. సైజును బట్టి ఈ సిలికాన్‌ మూతల్ని ఇంట్లో ఉన్న రాయి రోళ్లకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక మూత మాదిరిగా సరిగ్గా ఫిట్ అయ్యేలా రోకలి ఉన్న మార్బుల్‌ రోళ్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి, అలాంటి మూతతో కూడిన రోళ్లపై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్