నూనె పెడతాయ్‌.. మసాజ్‌ చేస్తాయ్!

జుట్టు ఆరోగ్యంగా ఎదగాలంటే తరచూ నూనెతో మర్దన చేసుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో నూనె కుదుళ్ల వరకు చేరితేనే ఫలితం ఉంటుంది. కానీ చేత్తో నూనెను అప్లై చేసుకోవడం వల్ల అది కుదుళ్లలో సమానంగా పరచుకోలేకపోవచ్చు.

Published : 05 Feb 2024 12:28 IST

జుట్టు ఆరోగ్యంగా ఎదగాలంటే తరచూ నూనెతో మర్దన చేసుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో నూనె కుదుళ్ల వరకు చేరితేనే ఫలితం ఉంటుంది. కానీ చేత్తో నూనెను అప్లై చేసుకోవడం వల్ల అది కుదుళ్లలో సమానంగా పరచుకోలేకపోవచ్చు. ఫలితంగా అక్కడ కుదుళ్లు పొడిబారిపోయి జుట్టు రాలడం మొదలవుతుంది. ఈ సమస్యకు ‘ఆయిల్‌ అప్లికేటర్స్‌’ చక్కటి పరిష్కారం చూపుతున్నాయి.

విభిన్న ఆకృతుల్ని పోలిన బాటిల్స్‌లా ఉండే వీటికి ముందు భాగంలో దువ్వెనలాంటి అమరిక ఉంటుంది. వాటి బ్రిజిల్స్‌కి సన్నటి రంధ్రాలుంటాయి. ముందుగా బాటిల్స్‌లో నూనెను నింపి.. కాస్త ప్రెస్‌ చేస్తూ కుదుళ్ల పైనుంచి కింది దాకా దువ్వాలి. ఇలా చేయడం వల్ల బ్రిజిల్స్‌ రంధ్రాల నుంచి కొద్దికొద్దిగా నూనె బయటికి వచ్చి.. కుదుళ్ల దగ్గర్నుంచి జుట్టు చివర్ల దాకా నూనె సమానంగా పరచుకుంటుంది. తద్వారా కుదుళ్లు తేమను కోల్పోకుండా ఉంటాయి. ప్రస్తుతం వీటిలోనూ ప్లాస్టిక్‌, చెక్కతో చేసినవి దొరుకుతున్నాయి. కొన్ని ఆయిల్‌ అప్లికేటర్స్‌కి బ్రిజిల్స్‌తో పాటు మసాజ్‌ చేసుకోవడానికి వీలుగా మృదువైన బ్రిజిల్స్‌ అమరి ఉన్నాయి. వాటికి అడుగున గుండ్రంగా తిరిగే బాల్స్‌ లాంటి అమరిక ఉంటుంది. వీటి సహాయంతో కుదుళ్లకు, జుట్టుకు నూనె పట్టించడంతో పాటు.. కుదుళ్లకు మర్దన కూడా అందుతుంది. ఇలా జుట్టు, కుదుళ్ల ఆరోగ్యాన్ని పెంచే ఆయిల్‌ అప్లికేటర్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. మీరూ వీటిపై ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్