ఇలా ప్రెస్‌ చేస్తే.. అలా ఒత్తిడి మాయం!

ఇటు ఇంటి పనితో, అటు ఆఫీస్‌ పనితో సతమతమవుతుంటారు మహిళలు. వీటికి తోడు ఆరోగ్యపరంగా, వ్యక్తిగతంగా మరికొన్ని సమస్యలు వారిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి మితిమీరితే ఒత్తిడి దరిచేరుతుంది.

Updated : 16 Nov 2023 14:08 IST

ఇటు ఇంటి పనితో, అటు ఆఫీస్‌ పనితో సతమతమవుతుంటారు మహిళలు. వీటికి తోడు ఆరోగ్యపరంగా, వ్యక్తిగతంగా మరికొన్ని సమస్యలు వారిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి మితిమీరితే ఒత్తిడి దరిచేరుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ సమస్య నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అయితే ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ‘అ ఆ’ సినిమాలో సమంత స్ట్రెస్‌ బాల్‌ని ఉపయోగించడం మనం చూసుంటాం. ఇదే కాదు.. ఒత్తిడికి చెక్‌ పెట్టే ప్రెస్సింగ్‌ హ్యాండ్‌ టూల్స్‌ ప్రస్తుతం మార్కెట్లో బోలెడున్నాయి.

అర్ధచంద్రాకారంలో వంచడానికి వీలుగా ఉండే ఫ్లెక్స్‌బార్‌, సాలెగూడు తరహాలో ఉండే వెబ్‌ హ్యాండ్‌ టూల్‌, అరచేతిలో పెట్టి ప్రెస్‌ చేసే సిలికాన్‌ రింగ్స్‌, మణికట్టుకు బిగించుకొని వేళ్లతో ప్రెస్‌ చేసి వదిలే హ్యాండ్‌ గ్రిప్స్‌, హ్యాండ్‌ రెసిస్టెన్స్‌ బ్యాండ్స్‌, గన్‌ ఆకృతిలో ఉన్న ఫింగర్‌ గ్రిప్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టూల్సే ఉన్నాయి. వీటిని ఉపయోగించే క్రమంలో చేతులకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తద్వారా ఒత్తిడి నుంచి విముక్తి పొందచ్చు.. అంతేకాదు.. ఈ టూల్స్‌ వల్ల చేతులకు చక్కటి వ్యాయామం కూడా అందుతుంది.. ఫలితంగా చేతి కండరాలూ దృఢమవుతాయి. ఒత్తిడిని తగ్గించి వ్యాయామాన్ని అందించే ఈ టూ-ఇన్‌-వన్‌ ప్రెస్సింగ్‌ హ్యాండ్‌ టూల్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్