Fruits: వేడిని తగ్గించే పండ్లు

కాలంతో పాటూ మనమూ మారాలి. తినే ఆహారపుటలవాట్లనూ మార్చుకోవాలి. ఈ వేసవిలో డీహైడ్రేషన్‌ బారిన పడకూడదన్నా... ఆరోగ్యంగా ఉండాలన్నా తప్పక ఈ పండ్లను తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటి? వాటితో ప్రయోజనాలేమున్నాయో తెలుసుకుందామా!

Updated : 20 Mar 2023 07:32 IST

కాలంతో పాటూ మనమూ మారాలి. తినే ఆహారపుటలవాట్లనూ మార్చుకోవాలి. ఈ వేసవిలో డీహైడ్రేషన్‌ బారిన పడకూడదన్నా... ఆరోగ్యంగా ఉండాలన్నా తప్పక ఈ పండ్లను తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటి? వాటితో ప్రయోజనాలేమున్నాయో తెలుసుకుందామా!


* మామిడి: పండ్లరాజుగా పిలిచే మామిడి పండుని మెచ్చనివారెవరు? 82 శాతం నీటిని కలిగిన ఈ పండ్లు ఆకలిని పుట్టిస్తాయి. జీర్ణ ప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తాయి. ఇందులోని విటమిన్‌ ఎ,సిలు కంటిచూపుని మెరుగుపరుస్తాయి. ఈ పండుని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. 


* నారింజ: ఈ పండులోని పోషకాలు గుండె పనితీరుని సరిచేస్తాయి. శరీరంలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి. నారింజలో ఉండే 85శాతం నీరు... నిస్సత్తువ రాకుండా చూస్తుంది.


* కర్బూజ: మెగ్నీషియం, పొటాషియంలు మెండుగా ఉండే ఈ పండుని తినడం వల్ల  రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పండుకి ఉన్న  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగానూ ఉంటుంది.


* పుచ్చకాయ: తొంభైశాతం నీటితో నిండి ఉండే పుచ్చకాయని ఈ కాలంలో తప్పక తినాలి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్‌, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు కలిగి ఉన్న ఈ పండు...ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా చూస్తుంది. చెమట కారణంగా కోల్పోయిన విటమిన్లూ, ఖనిజాలను
భర్తీ చేస్తుంది.


* దోసకాయ: రకమేదైనా ఈ పండునిని పచ్చిగా తీసుకున్నా, సలాడ్లలో కలుపుకొన్నా, కూర వండుకున్నా కూడా మంచిదే. పొటాషియం, విటమిన్‌ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. ఎండబారిన పడకుండా కాపాడతాయి.


* తాటి ముంజెలు: కార్బొహైడ్రేట్లు, ఫైటో న్యూట్రియంట్లు, క్యాల్షియం వంటివాటితో నిండిన ముంజెల్లో కెలొరీలు తక్కువ. నీటి శాతం ఎక్కువ. ఈ కాలంలో జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిని తింటే ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్