ఫ్రిజ్ డోర్.. వీటితో అందంగా..!

రిఫ్రిజిరేటర్‌.. ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఉండే నిత్యావసర గృహోపకరణమిది. అయితే ఇందులోనూ రోజురోజుకీ కొత్త కొత్త మోడల్స్‌ పుట్టుకొస్తున్నాయి. అలాగని ప్రతిసారీ మోడల్‌ని, డిజైన్‌ని మార్చలేం. కానీ ఫ్రిజ్‌ డోర్‌కి కొత్త హంగులద్దుతూ దీన్ని సరికొత్తగా, ఆకర్షణీయంగా మార్చడం మాత్రం చాలా తేలికైన పని.

Published : 09 Jan 2024 12:10 IST

రిఫ్రిజిరేటర్‌.. ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఉండే నిత్యావసర గృహోపకరణమిది. అయితే ఇందులోనూ రోజురోజుకీ కొత్త కొత్త మోడల్స్‌ పుట్టుకొస్తున్నాయి. అలాగని ప్రతిసారీ మోడల్‌ని, డిజైన్‌ని మార్చలేం. కానీ ఫ్రిజ్‌ డోర్‌కి కొత్త హంగులద్దుతూ దీన్ని సరికొత్తగా, ఆకర్షణీయంగా మార్చడం మాత్రం చాలా తేలికైన పని. ఇందుకోసమే ప్రస్తుతం విభిన్న రకాల ‘ఫ్రిజ్‌ స్టిక్కర్స్‌/వాల్‌పేపర్స్‌’ మార్కెట్లోకొచ్చేశాయి.

పువ్వులు-ఆకుల బ్యాక్‌గ్రౌండ్‌తో కూడినవి, నెమళ్లు, పండ్లు, త్రీడీ ప్రింటెడ్‌ తరహాలో రూపొందించినవి, వినైల్‌ ప్రింటింగ్‌ తరహాలో తీర్చిదిద్దినవి, త్రీడీ ఎంబోస్‌డ్‌ ప్రింటింగ్‌తో తయారుచేసినవి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిజైన్లలో ఇవి లభిస్తున్నాయి. వీటిని ఉపయోగించడం కూడా చాలా సులువు. ఈ వాల్‌పేపర్‌కి వెనక వైపు ఉన్న గ్లూ స్టిక్కర్‌ని తొలగించి.. ఫ్రిజ్‌పై అతికించేయడమే..! ఇక డబుల్‌ డోర్‌, నాలుగు డోర్లున్న ఫ్రిజ్‌ అయితే పార్టిషన్స్‌ ఉన్న చోట ఈ స్టిక్కర్‌ని కట్‌ చేస్తే సరిపోతుంది. కావాలంటే ఈ స్టిక్కర్‌కి అవుట్‌లైన్స్‌గా గోల్డెన్‌ లేదా సిల్వర్‌ కలర్‌ ఉన్న సన్నటి స్టిక్కర్‌ని అతికిస్తే లుక్‌ అదిరిపోతుంది. ఇక ఇవి పాతబడిపోయాక.. వీటిని తొలగించి కొత్త మోడల్‌ స్టిక్కర్స్‌ని అతికించుకోవచ్చు! అయితే ఈ వాల్‌పేపర్స్‌ని ఫ్రిజ్‌ డోర్స్‌కే కాదు.. ఏసీ ముందు భాగంలో, వాషింగ్‌ మెషీన్‌ ముందు వైపు, టేబుల్స్‌ పక్కలకూ అతికించుకోవచ్చు.. సింపుల్‌గా ఉన్న డిజైన్లైతే గోడ పైనా అతికించుకోవచ్చు.. అలాంటి కొన్ని ఫ్రిజ్‌ స్టిక్కర్స్‌ని ఇక్కడ చూసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్