Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145563
            [news_title_telugu_html] => హృతిక్‌ ఇచ్చిన పుస్తకం నా జీవితాన్నే మార్చేసింది!
            [news_title_telugu] => హృతిక్‌ ఇచ్చిన పుస్తకం నా జీవితాన్నే మార్చేసింది!
            [news_title_english] => Actress-SameeraReddy-has-revealed-about-stammering-problem
            [news_short_description] => బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నారు సినీ నటి సమీరా రెడ్డి. మాటల్లో తడబాటుతో తానెంతో ఇబ్బంది పడేదాన్నని.....

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [news_sections] => ,0207,
        )

)
హృతిక్‌ ఇచ్చిన పుస్తకం నా జీవితాన్నే మార్చేసింది! - Actress-SameeraReddy-has-revealed-about-stammering-problem - EENADU
close
బాలీవుడ్
హృతిక్‌ ఇచ్చిన పుస్తకం నా జీవితాన్నే మార్చేసింది!

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నారు సినీ నటి సమీరా రెడ్డి. మాటల్లో తడబాటుతో తానెంతో ఇబ్బంది పడేదాన్నని.. ఆ సమస్యని అధిగమించేందుకు హృతిక్‌ సహాయపడ్డారని ఆమె వెల్లడించారు. మాట్లాడటంలో తడబాటు సమస్యతో తానెదుర్కొన్న ఇబ్బందులను ఆమె ఓ చాట్‌ షోలో వెల్లడించారు. హృతిక్‌ రోషన్‌ కూడా తన జీవితంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారని సమీరా తెలిపారు. ‘‘ఈ సమస్యతో ఎవరి ముందైనా మాట్లాడాలంటేనే భయపడేదాన్ని. ఆడిషన్స్‌కు వెళ్లేటప్పుడు ఇంకా ఇబ్బంది అయ్యేది. నా సమస్యను హృతిక్‌ రోషన్‌ గుర్తించారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన ఓ పుస్తకం నా జీవితాన్నే మార్చేసింది. నాలో భయాన్ని అధిగమించేందుకు ఆ పుస్తకం ఎంతో దోహదపడింది. క్రమంగా నేను నా మాటల్లో మార్పును గమనించా. నేను స్పీచ్‌ థెరఫిస్ట్‌ను కూడా కలిశా. ఆ పుస్తకం ఇచ్చిన హృతిక్‌కి థ్యాంక్స్‌ చెప్పినా సరిపోదు. ఆ పుస్తకం ఇప్పటికీ నా దగ్గరే ఉంది’’ అని గుర్తుచేసుకున్నారు.

ఇటీవలే ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సమీరా.. నైరా అని నామకరణం చేసింది. తెలుగులో అశోక్‌, నరసింహుడు, జై చిరంజీవ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.