close
బాలీవుడ్
ఆ జోడీ మరోసారి

టీవలే ‘హౌస్‌ఫుల్‌ 4’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది కృతి సనన్‌. అందులో అక్షయ్‌ కుమార్‌కు తొలిసారి జోడీగా కనిపించి అందాలతో కనువిందు చేసింది. ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ ఆనందంలో ఉండగానే కృతికి మరోసారి అక్షయ్‌ సరసన నటించే అవకాశం దక్కింది. అక్షయ్‌ హీరోగా నటించనున్న చిత్రం ‘బచ్చన్‌ పాండే’. ‘హౌస్‌ఫుల్‌ 4’ దర్శకుడు ఫర్హాద్‌ సామ్‌జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో కథానాయికగా కృతిని ఎంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

‘‘హౌస్‌ఫుల్‌ 4’లో కృతి పనితీరు ఫర్హాద్‌కు నచ్చింది. అందుకే తన తదుపరి చిత్రం ‘బచ్చన్‌ పాండే’లోనూ ఆమెనే నాయికగా ఎంచుకున్నారు. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు’’ అని చిత్రబృంద సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా అర్జున్‌ కపూర్‌తో కలసి కృతి నటిస్తున్న భారీ చారిత్రక చిత్రం ‘పానిపట్’ డిసెంబరు 6న విడుదల కానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.