Published : 30/09/2021 17:39 IST

అతను మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడా??

'ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే..' ఏంటీ మీ బాయ్‌ఫ్రెండ్ కూడా మిమ్మల్ని చూసి ఇలాగే పాడుతున్నాడా?? మరి అతను చూపించేది నిజమైన ప్రేమైతే సంతోషమే.. లేదంటే తర్వాత బాధపడాల్సింది మాత్రం మీరే. ప్రేమించడం, ప్రేమించబడడం ఎవరి జీవితంలోనైనా మర్చిపోలేని అనుభూతే. కానీ అవతలి వ్యక్తి మిమ్మల్ని నిజంగా, సిన్సియర్‌గా లవ్ చేస్తున్నారా? లేదా? అని తెలుసుకునే బాధ్యత మాత్రం మీదే. మరి అది తెలుసుకోవడమెలా? అంటారా?? అయితే ఇది చదవండి..

* ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే మీకోసం ఎంత కష్టమైనా పడటానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే మీ సుఖాల్ని తన సుఖాలుగా.. మీ కష్టాల్ని తన కష్టాలుగా భావిస్తాడు.

* మీ కుటుంబంతో, సన్నిహితులతో సత్సంబంధాలు కలిగి ఉంటాడు.

* తనకు వీలు దొరికినప్పుడల్లా మీతోనే గడపడానికి ఇష్టపడతాడు. అలాగే మిమ్మల్ని చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేడు. ఎంత దూరంలో ఉన్నా వేళకు మీకు ఫోన్ చేయడం, మీ మంచిచెడ్డలు అడిగి తెలుసుకోవడం.. ఇలా తరచూ కాంటాక్ట్‌లో ఉంటాడు.

* ఏ విషయంలో అయినా సరే మీతో సంభాషించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాడు.

* మీరు గెలిచినప్పుడు సంతోషిస్తాడు.. ఓడినప్పుడు ఎంకరేజ్ చేస్తాడు.

* మీరేదైనా మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని గౌరవిస్తాడు.

* ఏదీ దాచకుండా.. అతనికి సంబంధించిన ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటాడు.

* మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే కనుక.. పదిమందిలో కూడా నిర్భయంగా ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరికో భయపడి మొహం చాటేయడు. మిమ్మల్ని ప్రేమించే విషయాన్ని రహస్యంగా ఉంచడు.

* వాళ్లింట్లో ఏవైనా పార్టీలైనా, ఫంక్షన్లు అయినా మిమ్మల్ని పిలవడం; స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం.. లాంటివి చేస్తాడు.

* ఏ విషయంలోనూ మీతో తప్పుగా ప్రవర్తించడు. ఇతరుల వద్ద మీ గురించి కామెంట్స్ చేయడం, తప్పుగా మాట్లాడటం.. లాంటివి ఎంతమాత్రం చేయడు.

* మిమ్మల్ని ఏ చిన్న విషయంలోనూ బాధపెట్టడు. మీరెప్పుడూ నవ్వుతూ ఉండటాన్నే అతను ఇష్టపడతాడు.

* మీతో మాట్లాడేటప్పుడు చాలా సూటిగా, స్పష్టంగా మీ కళ్లలోకి చూస్తూ మాట్లాడతాడు.

చూశారుగా.. నిజమైన ప్రేమికుడిలో ఉండే కొన్ని లక్షణాల గురించి. అయితే ఇక్కడ ఒక చిన్న మాట. ఏ విషయంలో అయినా కొన్ని మినహాయింపులుంటాయి. ఫలానా విషయంలో 'ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు..' అని కచ్చితంగా చెప్పలేం. ప్రేమ విషయంలోనూ అంతే. కాబట్టి ఇక్కడ ఇచ్చిన లక్షణాలన్నీ నిజమైన ప్రేమకు కొన్ని సూచికలు మాత్రమే. ఇందుకు మినహాయింపులూ ఉండచ్చు.. ఈ లక్షణాలను మీ స్వీయ అనుభవాలకు, అనుభూతులకు అన్వయించుకుంటూ అవతలి వ్యక్తిది నిజమైన ప్రేమా? కాదా? అన్న విషయంలో ఎవరికి వారుగా ఒక నిర్ణయానికి రావడం అన్నివిధాలా శ్రేయస్కరం!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని