Ambani Couple: హస్తాక్షర్‌.. ఈ వేడుక ప్రత్యేకతేంటో తెలుసా?

జూనియర్ అంబానీ కపుల్‌ అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ ముందస్తు పెళ్లి వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో జరిగాయి. వేడుకలకు హాజరైన అతిథులకు ఎంజాయ్‌మెంట్‌తో పాటు ఎన్నో మధురానుభూతుల్నీ పంచాయి.

Updated : 05 Mar 2024 21:17 IST

(Photos: Instagram)

జూనియర్ అంబానీ కపుల్‌ అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ ముందస్తు పెళ్లి వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో జరిగాయి. వేడుకలకు హాజరైన అతిథులకు ఎంజాయ్‌మెంట్‌తో పాటు ఎన్నో మధురానుభూతుల్నీ పంచాయి. సరికొత్త సంప్రదాయాల్నీ పరిచయం చేశాయి. ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా ఆఖరిగా జరిగిన హస్తాక్షర్‌ కూడా అలాంటి వేడుకే! అటు కొత్త జంటకు, ఇటు అతిథులకు సరికొత్త అనుభూతిని పంచిన ఈ వేడుక గురించి తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

మూడు రోజుల పాటు జరిగిన అనంత్‌-రాధికల ప్రి-వెడ్డింగ్‌ వేడుకలకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వేదికైంది. ‘అన్న సేవ’తో మొదలైన ఈ సెలబ్రేషన్స్‌కు ‘హస్తాక్షర్‌’తో ముగింపు పలికారు ఇరు కుటుంబ సభ్యులు. దేశ, విదేశీ సెలబ్రిటీలంతా కలిసి మొత్తం వెయ్యి మందికి పైగా అతిథులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. అంబానీ వారి ఆతిథ్యాన్ని స్వీకరించి మురిసిపోయారు.

హస్తాక్షర్‌.. ప్రత్యేకత అదే!

ఈ ప్రి-వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రతి వేడుకలోనూ ఆటపాటలతో సందడి చేశారు కాబోయే వధూవరులు, ఇరు కుటుంబ సభ్యులు. చివరి ఈవెంట్ ‘హస్తాక్షర్’ లోనూ ఇదే సీన్‌ రిపీటైంది. ఇందులో భాగంగా కాబోయే దంపతులు సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు. రాధిక పీచ్‌ కలర్‌ లెహెంగా శారీలో తళుక్కుమనగా, అనంత్‌ కుర్తా-పైజామా ఎంచుకున్నాడు. తన అటైర్‌కు జతగా హెడ్‌వెయిల్‌ ధరించి, ‘కభీ కుషీ కభీ ఘమ్‌’ సినిమాలోని పాట బ్యాక్‌డ్రాప్‌గా రాధిక ఇచ్చిన బ్రైడల్‌ ఎంట్రీ వేడుకకే హైలైట్‌గా నిలిచిందని చెప్పచ్చు. ఇలా తన ఇష్టసఖి రాకను ఆసక్తిగా చూస్తూ.. ఆమె చేతిలో చెయ్యి వేసి వేదిక పైకి ఆహ్వానించాడు అనంత్‌. ఆపై వీరిద్దరూ వేద పండితుల సమక్షంలో, అందరి ఆశీర్వచనాల మధ్య సంతకాలు చేసి.. అధికారికంగా ఒక్కటయ్యారు. హస్తాక్షర్‌/సంతకాల వేడుకగా పిలిచే ఈ ఈవెంట్‌ ద్వారా కాబోయే వధూవరుల్ని మరింత దగ్గర చేశారు ఇరు కుటుంబ సభ్యులు. జీవితాంతం అనుబంధానికి కట్టుబడి ఉంటామని కాబోయే దంపతులు, వారి కుటుంబ సభ్యులు అందరి ముందు చేసుకునే ప్రమాణం ఇది. దాదాపుగా ఇది రిజిస్టర్‌ మ్యారేజ్ని పోలి ఉంటుంది. ఇక ప్రతి వేడుకలాగే ఈ ‘హస్తాక్షర్’లోనూ అతిథులు ప్రత్యేకమైన ట్రెడిషనల్‌ డ్రస్‌ కోడ్‌లో మెరిసిపోయారు.


నీతా డ్యాన్స్‌ అదుర్స్!

స్వతహాగా శాస్త్రీయ నృత్యంలో పట్టున్న నీతా అంబానీ తమ కుటుంబంలో జరిగే ప్రతి వేడుకలోనూ నృత్య ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటారు. అనంత్‌-రాధికల ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లోనూ ఆమె తన నాట్యంతో మరోసారి అతిథులకు కనువిందు చేశారు. ‘హస్తాక్షర్‌’ ఈవెంట్‌లో ‘విశ్వంభరి స్తుతి’తో అమ్మవారిని ఆరాధిస్తూ ఆమె చేసిన నాట్య ప్రదర్శన అదుర్స్‌ అనిపించింది. కాబోయే కొత్త జంటపై ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కాంక్షిస్తూ ఆమె తన నాట్యాన్ని కొనసాగించారు. ఇక స్త్రీత్వానికి, మహిళా శక్తికి ప్రతీకగా నిలిచే ఈ నృత్యాన్ని తన మనవరాళ్లకు (ఈషా, ఆకాశ్‌ పిల్లలు) అంకితమిచ్చారామె. ఇలా అంబానీ-మర్చంట్‌ కుటుంబాలు నిర్వహించిన ఈ ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు, వాటికి సంబంధించిన ఫొటోలు-వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

రాధిక-అనంత్‌ల కల్యాణం.. కనులకు వైభోగమే!

 





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్