మా బాబుకి ఆరు నెలలు.. పాలివ్వడం ఆపేయచ్చా?

మా బాబుకి ఆరు నెలలు. అయితే వాడికి 30 నుంచి 60 ఎంఎల్‌ వరకు రాగి జావ ఇవ్వడం ప్రారంభించాను. ఇది సరిపోతుందా? ఇంకా ఏమైనా ఇవ్వాలా? అలాగే ఈ వయసులో వాడికి ఎంత మోతాదులో నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడు వాడికి పాలు పట్టడం ఆపచ్చా? దయచేసి సలహా ఇవ్వగలరు.

Published : 28 Feb 2024 19:31 IST

మా బాబుకి ఆరు నెలలు. అయితే వాడికి 30 నుంచి 60 ఎంఎల్‌ వరకు రాగి జావ ఇవ్వడం ప్రారంభించాను. ఇది సరిపోతుందా? ఇంకా ఏమైనా ఇవ్వాలా? అలాగే ఈ వయసులో వాడికి ఎంత మోతాదులో నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడు వాడికి పాలు పట్టడం ఆపచ్చా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. సాధారణంగా పిల్లలకు ఐదు నెలల తర్వాత జీర్ణవ్యవస్థ క్రమంగా మెరుగుపడుతుంది. అలాగే తల్లిపాలు కూడా సరిపోవు. కాబట్టి, పిల్లలకు ఐదు నెలల తర్వాత ఘన పదార్థాలు ఇస్తుండాలి. ఇందుకోసం రాగిజావ ఇవ్వడం మంచి పద్ధతి. చాలామంది ఇతర పదార్థాలు కూడా ఇస్తుంటారు. బియ్యం, పప్పులు దంచిన పౌడర్‌ను ఉగ్గు రూపంలో ఇస్తుంటారు. అయితే మొదటి ఆహారంలో భాగంగా రాగి జావ ఇవ్వడం మంచిది. మొలకలు వచ్చిన రాగులను దంచి నీళ్లలో మరగబెట్టి పేస్ట్‌ లాగా చేయాలి. ఈ పేస్ట్‌ను రోజుకు రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఇస్తుండాలి. ఆ తర్వాత క్రమంగా మోతాదు పెంచుతుండాలి. 15 నుంచి 20 రోజుల తర్వాత ఇతర ఘన పదార్థాలు కూడా అలవాటు చేయచ్చు. ఇందులో భాగంగా యాపిల్‌, అరటిపండు వంటి వాటిని గుజ్జు చేసి పెట్టచ్చు. బిస్కట్స్ వంటి ఇతర పదార్థాలను కూడా ఇవ్వచ్చు.

పిల్లలకు ఘన పదార్థాలు ఇచ్చిన తర్వాత నీళ్లు కూడా పట్టాలి. లేదంటే డీహైడ్రేషన్‌ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే దీనికి మోతాదంటూ ఏమీ ఉండదు. వాళ్లు తాగినన్ని నీళ్లు పట్టాలి. కాచి చల్లార్చిన నీళ్లను ఇవ్వడం మంచిది. ఎండాకాలంలో సాధారణం కంటే ఎక్కువగానే నీళ్లు తాగిస్తుండాలి. ఇక పిల్లలకు ఘన పదార్థాలు ఇచ్చినా కూడా తల్లిపాలు పట్టిస్తుండాలి. ఇతర పదార్థాలతో పాటు రెండేళ్ల వరకు తల్లి పాలు కూడా ఇవ్వచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్