అలసిన కళ్లకు...

నిద్రలేమీ, ఒత్తిడీ, అనారోగ్యకర జీవన శైలీ, అదే పనిగా కంప్యూటర్‌, టీవీ ముందు కూర్చోవడం, ఎక్కువగా పుస్తకాలు చదవడం వల్ల కళ్లు అలసిపోతాయి. మరి వీటికి సాంత్వన చేకూర్చేదెలా...?

Updated : 22 Nov 2022 14:19 IST

నిద్రలేమీ, ఒత్తిడీ, అనారోగ్యకర జీవన శైలీ, అదే పనిగా కంప్యూటర్‌, టీవీ ముందు కూర్చోవడం, ఎక్కువగా పుస్తకాలు చదవడం వల్ల కళ్లు అలసిపోతాయి. మరి వీటికి సాంత్వన చేకూర్చేదెలా...?

* ఫ్రిజ్‌లో పెట్టి తీసిన రెండు చెంచాలను మీ కళ్లపై కాసేపు ఉంచండి. ఇలా చేయడం వల్ల ఉబ్బిన కళ్ల సమస్య తగ్గుతుంది.
* చల్లటి పచ్చిపాలలో రెండు దూది ఉండలను నానబెట్టి వాటిని కళ్లపై ఓ పది నిమిషాలపాటు ఉంచాలి. పాలు కంటి చుట్టూ ఉండే చర్మానికి పోషణ ఇస్తూనే దాన్ని శుభ్రపరుస్తాయి. కళ్ల వాపును కూడా తగ్గిస్తాయి. దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల కంటి కింద నల్లటి వలయాలు కూడా క్రమంగా తగ్గిపోతాయి.
* బాదం నూనెలోని విటమిన్‌ కె కళ్లకు కావాల్సిన తేమను అందిస్తుంది. అంతేకాదు దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కళ్ల వాపును కూడా తగ్గిస్తాయి. అలసిన కళ్లకు సాంత్వననిస్తాయి.
* టీ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లూ, సహజ టానిన్లు కంటి కింద ఉండే వాపును తగ్గించేలా చేస్తాయి. మొదట టీ పొడి బ్యాగులను వేడి నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత బ్యాగులను ఫ్రిజ్‌లో కాసేపు ఉంచి తరవాత కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లు శుభ్రపడటమే కాకుండా ఉబ్బు కూడా తగ్గుతుంది. కళ్ల అలసటా ఉండదు.
* గుడ్డులోని తెల్లసొనను బాగా గిలకొట్టి బ్రష్‌ సాయంతో కంటిచుట్టూ రాసి అయిదు నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మీ కంటి చుట్టూ ఉండే చర్మం బిగుతుగా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్