కురులు వేగంగా పెరగాలా?

పొడవైన జుట్టు చాలామంది అమ్మాయిల కల. కానీ అదేమో త్వరగా ఎదగట్లేదు అని బాధపడుతున్నారా? ఇందుకు షాంపూలు మారుస్తూ పోతే సరిపోదు. లోపల్నుంచీ పోషణ కావాలంటున్నారు నిపుణులు. కొన్నింటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోమంటున్నారు. గుడ్డు.. జుట్టు పెరుగుదలలో తోడ్పడే బయోటిన్‌ అనే ప్రొటీన్‌ దీనిలో పుష్కలం. వెంట్రుకల ఫాలికిల్స్‌ ప్రొటీన్‌తో నిర్మితమై ఉంటాయి. అది లోపించిందో పెరుగుదల నెమ్మదించడమే కాదు.. వెంట్రుకలు

Updated : 21 Jun 2022 05:02 IST

పొడవైన జుట్టు చాలామంది అమ్మాయిల కల. కానీ అదేమో త్వరగా ఎదగట్లేదు అని బాధపడుతున్నారా? ఇందుకు షాంపూలు మారుస్తూ పోతే సరిపోదు. లోపల్నుంచీ పోషణ కావాలంటున్నారు నిపుణులు. కొన్నింటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోమంటున్నారు.

గుడ్డు.. జుట్టు పెరుగుదలలో తోడ్పడే బయోటిన్‌ అనే ప్రొటీన్‌ దీనిలో పుష్కలం. వెంట్రుకల ఫాలికిల్స్‌ ప్రొటీన్‌తో నిర్మితమై ఉంటాయి. అది లోపించిందో పెరుగుదల నెమ్మదించడమే కాదు.. వెంట్రుకలు నెరవడానికీ కారణమవుతాయి. వీటన్నింటినీ గుడ్డులోని ప్రొటీన్‌ నివారిస్తుంది. అదనంగా జింక్‌, సెలెనియం, ఎ, డి, బి1 విటమిన్లతోపాటు కెరొటినాయిడ్లు, ఇతర పోషకాలూ అందుతాయి.

పీనట్‌ బటర్‌.. దీని ద్వారా కురులకు ఆరోగ్యాన్నిచ్చే విటమిన్‌ ఇ, బయోటిన్‌ వంటివి అందుతాయి. గుప్పెడు పల్లీలు తిన్నా 9 గ్రాముల ప్రొటీన్‌ అందుతుందట.

పాలకూర.. ఫొలేట్‌, ఐరన్‌, ఎ, సి విటమిన్‌ గుణాలెక్కువ. ఇవి వెంట్రుకలు మందంగా అవ్వడంలో సాయపడతాయి. రోజూ చిన్న కప్పు చొప్పున తీసుకుంటే సరి. కుదుళ్లకు అవసరమైన తేమ, సీబమ్‌లను అందిస్తుంది.

క్యారెట్‌.. విటమిన్‌ ఎ అధిక మోతాదులో ఉంటుంది. పొడవు, బలమైన కురులు పొందడంలో ఇది సాయపడుతుంది. దీనిలోని ఎ, ఇ విటమిన్లు కుదుళ్ల వద్ద రక్తప్రసరణ బాగా జరిగేలా చూసి, తెల్లవెంట్రుకలు రావడాన్ని నెమ్మదింపజేస్తుంది.

చిలగడదుంప.. దీనిలోని బీటా కెరోటిన్‌ శరీరంలోకి చేరగానే విటమిన్‌ ఎగా మార్పు చెందుతుంది. కురులే కాదు.. ఎముకల ఆరోగ్యానికీ సాయపడుతుంది.

నట్స్‌.. అన్నింటినీ కలిపి ఓ గుప్పెడు తీసుకోండి. వీటిల్లో ఇ, బి విటమిన్లు, జింక్‌, ఫ్యాటీ యాసిడ్‌లతోపాటు మరెన్నో పోషకాలుంటాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంతోపాటు కురుల పెరుగుదలను వేగిర పరచడం ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్