ఒత్తైన జుట్టుకి గంజి

వాతావరణం మారింది. చినుకుల తడికి జుట్టు పాడవకుండా ఈ ఇంటి చిట్కాలను పాటించి చూడండి. ముఖ్యంగా బియ్యం కడిగిన నీళ్లు, గంజితో ఎన్నో ప్రయోజనాలున్నాయి...

Published : 17 Jun 2021 01:11 IST

వాతావరణం మారింది. చినుకుల తడికి జుట్టు పాడవకుండా ఈ ఇంటి చిట్కాలను పాటించి చూడండి. ముఖ్యంగా బియ్యం కడిగిన నీళ్లు, గంజితో ఎన్నో ప్రయోజనాలున్నాయి...
బియ్యం కడిగిన నీళ్లలో కాస్త కలబంద గుజ్జు కలిపి తలకు రాసుకుని ఆరనివ్వండి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి. కుదుళ్లు బలపడతాయి. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు... జుట్టుకి పోషణనిచ్చి నిగారింపుతో కనిపించేలా చేస్తాయి.
* జుట్టు బిరుసుగా అనిపించినప్పుడు గంజిలో కాస్త నిమ్మరసం కలిపి రాయండి. ఆరాక తలస్నానం చేయండి. తరచూ ఇలా చేస్తుంటే వెంట్రుకలు పట్టుకుచ్చులా మెరిసిపోతాయి.
* గంజిలో విటమిన్‌ బి, ఇ, సిలు ఉంటాయి. ఇవి వెంట్రుకలకు పోషణ అందించి ఆరోగ్యంగా మారుస్తాయి. సమపాళ్లలో కొబ్బరిపాలు, గంజి నీళ్లు తీసుకుని తలకు రాయండి. ఆపై గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్