స్క్రబ్‌.. చేద్దాం

వాతావరణ మార్పుల కారణంగా చర్మంపై మృతకణాలు ఏర్పడతాయి. వీటి వల్ల మళ్లీ మొటిమలు, మచ్చలు. తొలగించడానికి ఖరీదైన స్క్రబ్‌లే అక్కర్లేదు. ఇంట్లో దొరికే సహజసిద్ధ పదార్థాలతోనే సమస్య దూరం చేసుకోవచ్చు.

Published : 05 Aug 2023 00:15 IST

వాతావరణ మార్పుల కారణంగా చర్మంపై మృతకణాలు ఏర్పడతాయి. వీటి వల్ల మళ్లీ మొటిమలు, మచ్చలు. తొలగించడానికి ఖరీదైన స్క్రబ్‌లే అక్కర్లేదు. ఇంట్లో దొరికే సహజసిద్ధ పదార్థాలతోనే సమస్య దూరం చేసుకోవచ్చు. ఎలాగంటే..

చెంచా బేకింగ్‌సోడాలో కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి వలయాకారంలో మర్దనా చేస్తూ పట్టించాలి. ఆరాక చల్లటి నీటితో కడిగితే చాలు. చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి.

ఓట్‌మీల్‌తో.. రెండు చెంచాల ఓట్‌మీల్‌కి అంతే పరిమాణంలో పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రపరిస్తే ముఖం తేటగా కనిపిస్తుంది.

నిమ్మతో... టేబుల్‌ స్పూన్‌ బ్రౌన్‌షుగర్‌లో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి.. పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ట్యాన్‌ తొలగిపోతుంది.

అరటితో... ఒక అరటిపండు గుజ్జుకి రెండు చెంచాల బాదం పేస్టు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు. ముఖం నిగారిస్తుంది.

స్ట్రాబెర్రీతో.. మూడు స్ట్రాబెర్రీలను మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. ఈ పేస్టును ముఖంపై సున్నితంగా మర్దనా చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే చర్మం తేటగా కనిపిస్తుంది.

కీరతో...  కీరదోస రసంలో  కొద్దిగా వంటసోడా కలిపి ముఖానికి రాయాలి. పావుగంటయ్యాక చల్లటి నీటితో కడిగితే సరి. ఇలా తరచూ చేస్తుంటే చర్మ ఛాయ మెరుగవుతుంది.

తేనెతో.. నాలుగు చిన్న అవకాడో ముక్కలు తీసుకుని మెత్తని పేస్టులా చేయాలి. ఈ మిశ్రమానికి ఒక చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చక్కని ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని