షాంపూ మారుస్తున్నారా?

ప్రకటన చూసో... ఫ్రెండ్స్‌ చెప్పారనో మార్చే ఉత్పత్తుల్లో షాంపూ కూడా ఒకటి. మీరూ తరచూ అలాగే చేస్తుంటారా? మరి ఈ తీరు మంచిదేనా?

Published : 15 Mar 2024 01:40 IST

ప్రకటన చూసో... ఫ్రెండ్స్‌ చెప్పారనో మార్చే ఉత్పత్తుల్లో షాంపూ కూడా ఒకటి. మీరూ తరచూ అలాగే చేస్తుంటారా? మరి ఈ తీరు మంచిదేనా?

  • కొంతమంది చూడండి... ఒక్కసారి వేరే షాంపూతో తలస్నానం చేస్తే చాలు... జుట్టంతా ఊడిపోతోంది అంటారు. ఒకేదాన్ని తలకు అలవాటు చేయడం వల్ల వచ్చే సమస్యే ఇది. అందుకే వేరేవీ అలవాటు చేయాలి. అలాగని తరచూ మారుస్తున్నా సమస్యే! తల పొడిబారడం, దద్దుర్లూ వగైరా ఇబ్బంది పెడతాయి.
  • ఈ షాంపూ పడట్లేదు. రెండు మూడుసార్లు వాడగానే ఈ నిర్ణయానికి వచ్చేస్తారు చాలామంది. కొత్తదానికి అలవాటు పడటానికి మాడుకీ కాస్త సమయం పడుతుంది. కాబట్టి, వాడినరోజే ఫలితం కనిపించాలన్న తొందరొద్దు. కొద్దిరోజులు వాడాక కానీ ఏ నిర్ణయానికీ రావొద్దు.
  • మాటిమాటికీ షాంపూలు మారిస్తే, మాడుపై చర్మంలో పీహెచ్‌ స్థాయులు పడిపోతాయి. సహజనూనెల ఉత్పత్తిలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఫలితమే తలలో యాక్నే, చుండ్రు, దురద వంటి సమస్యలు. అంతేకాదు కురులూ నిర్జీవంగా తయారవుతాయి. కాబట్టి, కొనేముందే అవసరాలను ఓసారి గమనించుకోండి. ఒక్కోసారి కాలాన్ని బట్టి, చుండ్రు, కురులకు వేసిన రంగు పోకుండా ఉండటం వంటి ప్రత్యేక కారణాల రీత్యా అవసరాలు మారుతుంటాయి. అలాంటప్పుడు మార్చొచ్చు. అయితే ఎంచుకున్నదేదైనా కృత్రిమ పరిమళాలు, సల్ఫేట్లు, పారాబెన్స్‌ లేని రకాలకే ప్రాధాన్యమిస్తే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్