గోటితోనే పోదు మరి!

ముస్తాబులో తల నుంచి కాలి గోటి వరకు అంతా పద్ధతిగా ఉండాలనుకుంటాం అవునా? ఇంతకీ... గోళ్ల సంరక్షణ అంటే షేప్‌ చేయడం, రంగు వేయడానికే పరిమితం అవట్లేదు కదా! వాటినలా వదిలేయక పట్టించుకోండి.

Updated : 16 Mar 2024 01:59 IST

ముస్తాబులో తల నుంచి కాలి గోటి వరకు అంతా పద్ధతిగా ఉండాలనుకుంటాం అవునా? ఇంతకీ... గోళ్ల సంరక్షణ అంటే షేప్‌ చేయడం, రంగు వేయడానికే పరిమితం అవట్లేదు కదా! వాటినలా వదిలేయక పట్టించుకోండి. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది మరి!

క అధ్యయనంలో గోళ్ల కింద 32 రకాల బ్యాక్టీరియా, 28 రకాల ఫంగై పెరగడం గమనించారు. మాటిమాటికీ గోళ్లు విరగడం, అడపాదడపా చీలికలు వంటివి గమనిస్తుంటాం కదా! ఇవి గోళ్లు ఆరోగ్యంగా లేవనడానికి చిహ్నాలే. అంతటితో ఆగుతాయా... ఇలా సూక్ష్మజీవులకు ఆవాసంగా మారడమే కాదు, అనారోగ్యాలకూ దారి తీస్తాయి. కాబట్టి...

 ఆహారం ద్వారా బయోటిన్‌, ఎ, సి, డి, ఇ విటమిన్లు, ఐరన్‌, జింక్‌ వంటివి అందుతున్నాయా అనేది చూసుకోవాలి. ఇవి పుష్కలంగా అందే పండ్లు, కాయగూరలు, పప్పుధాన్యాలు, నట్స్‌కి రోజువారీ ఆహారంలో తప్పక ప్రాధాన్యం ఇవ్వాలి. అవసరమైతే వైద్యుల సాయంతో సప్లిమెంట్లు తీసుకున్నా మంచిదే. చర్మానికి తేమ అవసరమని తెలుసుగా? గోళ్లూ ఇందుకు మినహాయింపు కాదు. అందుకే తగినంత నీరూ తప్పక తీసుకోవాలి.

గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. ఇందుకు నెయిల్‌ క్లిప్పర్‌నే ఉపయోగించండి. అప్పుడు ఎగుడుదిగుడుగా కత్తిరించడం, పొరలుగా లేవడం లాంటి సమస్యలుండవు. ఇంకా చర్మానికి మరీ దగ్గరగానూ గోళ్లను కత్తిరించకూడదు. ఇంటి పనంటేనే నీటితో కూడుకున్నది. కానీ పదే పదే గోళ్లు నీటిలో నానితే పొడిబారడమే కాదు, సూక్ష్మజీవులకూ ఆవాసంగా మారతాయి. అవసరమైతే గ్లవుజులు వాడండి. రసాయన ఉత్పత్తులకూ దూరంగా ఉండాలి. రాత్రుళ్లు కొబ్బరి, విటమిన్‌-ఇ, జొజొబా నూనెలతో తప్పక మర్దనా చేస్తే గోళ్లు, వాటి చుట్టూ ఉండే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

 అందంగా కనిపించాలని గోళ్లకు నెయిల్‌ పాలిష్‌ వేయడం, పదేపదే రిమూవర్లతో తుడవడం లాంటివి చేయొద్దు. ఇవీ గోళ్ల ఆరోగ్యానికి చేటు చేసేవే. కావాలనిపిస్తే సహజ పదార్థాలతో చేసిన రంగులు, ఎసిటోన్‌, ఆల్కహాల్‌ లేని నెయిల్‌పాలిష్‌ రిమూవర్లకు ప్రాధాన్యమివ్వండి. ఇంకా... గోళ్లు పలచడబడం, రంగు మారడం వంటివి కనిపిస్తే వైద్యులను తప్పక సంప్రదించండి. సమస్య కొన్నిసార్లు గోటితోనే పోదు. కొన్ని అనారోగ్యాల సూచికలవి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్