నాకు ఏ క్రీమ్‌?

ఒక్కొక్కరిదీ ఒక్కో చర్మ తీరు అన్న విషయం తెలిసిందేగా! అలాంటప్పుడు అమ్మకో, స్నేహితురాలికో నప్పిన క్రీమ్‌ మీకెలా నప్పుతుంది? కాబట్టి, మీ చర్మానికి ఏం కావాలో తెలుసుకుని వాడితేనే... కావాల్సిన ప్రయోజనం పొందుతారు.

Published : 18 Mar 2024 01:58 IST

ఒక్కొక్కరిదీ ఒక్కో చర్మ తీరు అన్న విషయం తెలిసిందేగా! అలాంటప్పుడు అమ్మకో, స్నేహితురాలికో నప్పిన క్రీమ్‌ మీకెలా నప్పుతుంది? కాబట్టి, మీ చర్మానికి ఏం కావాలో తెలుసుకుని వాడితేనే... కావాల్సిన ప్రయోజనం పొందుతారు. కాబట్టి...

  • జిడ్డు చర్మమా? విపరీతంగా నూనెలు కారుతోంటే... హైలురోనిక్‌ యాసిడ్‌ ఉన్న సీరమ్‌ లేదా క్రీము వాడండి. ఇది జిడ్డును తగ్గించడమే కాదు, చర్మ ఆరోగ్యాన్నీ సంరక్షిస్తుంది. జిడ్డే కాదు, రంధ్రాలు పెద్దగా తెరుచుకున్నట్లు కనిపిస్తోంటే నియాసినమైడ్‌ ఉత్తమ ఎంపిక.
  • ఇక పొడిచర్మమైతే... లాక్టిక్‌ యాసిడ్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌లు ఎంచుకుంటే సరి. ఇవి చర్మరంధ్రాల్లోకి చేరిన మృతకణాలు తొలగించి, యాక్నే రాకుండా చూస్తాయి. మరీ ఎండిపోయినట్లు కనిపిస్తోంటే హైలురోనిక్‌ యాసిడ్‌, సెరమైడ్‌ క్రీములు వాడొచ్చు. ఇవి చర్మంలో తేమను బయటికి పోకుండా ఆపి, మెరిసేలా చూస్తాయి. యవ్వనంగా కనిపించాలంటే ఆర్గాన్‌, జొజొబా ఆయిల్‌ ఉన్న క్రీములను వాడితే సరి.
  • మొటిమలు ఎక్కువా? అయితే సాల్సిలిక్‌ యాసిడ్‌, క్లే ఆధారిత ఉత్పత్తులను ఎంచుకోండి. నియాసినమైడ్‌ చర్మరంధ్రాలను శుభ్రం చేసి, యాక్నేని రానివ్వదు. బెంజాల్‌ పెరాక్సైడ్‌ ఉన్నవీ వీటి బారి నుంచి రక్షించేవే.
  • ముప్పై దాటకుండానే ముఖంపై ముడతలు సాధారణం అయిపోయాయి కదూ! రెటినాల్‌ ఉన్న క్రీములు వాడండి. వృద్ధాప్యఛాయల్ని ఇది నెమ్మదింపజేస్తుంది. అయితే రాత్రి మాత్రమే వాడాలి. పగలు కనీసం 30 ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పనిసరి. ఇంకా కొలాజెన్‌, పెప్టైడ్‌ ఉన్న రకాలను ఎంచుకుంటే తగినంత తేమతోపాటు, చర్మం సాగే గుణం కోల్పోకుండా కాపాడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్