చినుకు పడేవేళ పాదాలు జాగ్రత్త!

అందంగా కనిపించాలని చర్మానికి క్రీములు, లోషన్‌లు రాస్తాం. జుట్టు, వస్త్రధారణలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ పాదాల విషయంలో మాత్రం కాస్త నిర్లక్ష్యం ప్రదర్శిస్తాం.

Published : 26 Jun 2021 01:15 IST

అందంగా కనిపించాలని చర్మానికి క్రీములు, లోషన్‌లు రాస్తాం. జుట్టు, వస్త్రధారణలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ పాదాల విషయంలో మాత్రం కాస్త నిర్లక్ష్యం ప్రదర్శిస్తాం. కాలి పగుళ్లు బాధించడమే కాదు చూడ్డానికీ బాగోవు. వీటికి ఈ కాలంలో ఫంగస్‌ కూడా చేరితే మరింత ఇబ్బంది. మరేం చేయాలి అంటారా?

యాంటీ మైక్రోబియల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్న తేనె.. పగిలిన పాదాలకు చక్కని మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. రోజూ రాత్రిపూట పాదాలకు పగుళ్లు ఉన్నచోట కొద్దిగా దీన్ని రాసి అరగంటయ్యాక శుభ్రం చేయండి. కాళ్లను తడి లేకుండా తుడుచుకోండి.

* కొబ్బరినూనెలో కాస్త కర్పూరం అరగదీసి... పాదాలు, వేళ్ల సందుల్లో రాయండి. ఒరుపులు, పగుళ్లు తగ్గుతాయి.

* బేకింగ్‌ సోడా నీటిలో కలిపి కాళ్లను శుభ్రం చేయాలి. ఆపై తడిలేకుండా పొడివస్త్రంతో తుడిచి పెట్రోలియం జెల్లీ రాయండి. రెండు సమస్యలూ అదుపులోకి వస్తాయి. వారానికోసారైనా ఆలివ్‌నూనెకు కాస్త గులాబీనీరు కలిపి పాదాలకు రాయండి. మంచి ఔషధంగా పనిచేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్