నడకే మందు!

మనలో చాలామందికి మూడు పదులు దాటగానే పొట్ట వస్తుంది. రాత్రి భోజనం కాగానే పడుకోవడం ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Published : 14 Jul 2021 01:11 IST

నలో చాలామందికి మూడు పదులు దాటగానే పొట్ట వస్తుంది. రాత్రి భోజనం కాగానే పడుకోవడం ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి పెందలాడే భోజనం చేసి, అరగంటసేపు నడవటమో లేదా, తేలికపాటి వ్యాయామమో చేసి పడుకుంటే ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది, పొట్ట కూడా రాదు.

రోజురోజుకీ పని భారంగా అనిపిస్తోందా? విసుగ్గా, అలసటగా ఉంటోందా? ఏవో శారీరక సమస్యలున్నట్టు, అశాంతి పాలైనట్టు భావన కలుగుతోందా? వీటన్నింటికీ దివ్యౌషధం కాసేపు పచ్చటి పార్కులో నడకేనట. మీ గురించి మీరు ఆలోచించుకుంటూ, మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటూ రోజూ కాసేపలా ఏకాంతంగా నడిచి చూడండి.. ఆ ప్రశాంతత మీకెంతో ఊరటనిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్