పళ్లు కొరక్కుండా!

కొందరు చిన్నారులకు నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఇది సాధారణ విషయమే. వైద్యులు బ్రక్సిజంగా పిలిచే ఈ సమస్య వల్ల దంత సంబంధిత ఇబ్బందులు ఎదురు కావొచ్చు. అలాకాకుండా ఉండాలంటే...

Published : 21 Jul 2021 00:44 IST

కొందరు చిన్నారులకు నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఇది సాధారణ విషయమే. వైద్యులు బ్రక్సిజంగా పిలిచే ఈ సమస్య వల్ల దంత సంబంధిత ఇబ్బందులు ఎదురు కావొచ్చు. అలాకాకుండా ఉండాలంటే...
ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొందరు పెద్దవాళ్లలోనూ ఉండొచ్చు. ఇందుకు ప్రత్యేకించి కారణాలు తెలియకపోయినా... కోపం, ఒత్తిడి, ఆందోళన... వంటి లక్షణాలున్న వారిలో దీన్ని గమనించొచ్చు అంటారు వైద్యులు. మీ బుజ్జాయిల్లో ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయేమో గమనించండి.
* అందుకు కారణాలు తెలుసుకుని అభద్రతను, భయాల్ని తొలగించండి. ఇందుకోసం వారితో తరచూ మాట్లాడటం అలవాటు చేసుకోండి. అలానే పిల్లలు నిద్రపోయే ముందు కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాఫీ, చాక్లెట్లు, ఆ ఫ్లేవర్డ్‌ ఐస్‌క్రీమ్‌లు వంటివి పెట్టకూడదు.
* నిద్రలేమి లేకుండా చూసుకోండి. అంటే కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రిస్తే సరి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే నోట్లో అమర్చే మౌత్‌ గార్డ్స్‌, మౌత్‌పీసెస్‌ వాడితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్