కళ్లను కాపాడే టొమాటోలు

ఎర్రగా మిలమిలలాడే టొమాటోల్లో ఉండే అందం, ఆకర్షణ మరే ఇతర కూర గాయల్లోనూ ఉండదు కదూ! ఇవి చూపులకే కాదు, ఆరోగ్యానికీ అంతే మంచివి...

Published : 22 Jul 2021 01:28 IST

ఎర్రగా మిలమిలలాడే టొమాటోల్లో ఉండే అందం, ఆకర్షణ మరే ఇతర కూర గాయల్లోనూ ఉండదు కదూ! ఇవి చూపులకే కాదు, ఆరోగ్యానికీ అంతే మంచివి...
* టోమాటోల్లో ఉండే లైకోపీన్‌ అల్ట్రా కిరణాల నుంచి శరీరానికి రక్షణ ఇస్తుంది. చర్మానికి కాంతినిస్తుంది.
* ఫైబర్‌ ఎక్కువగా ఉండటాన అరుగుదలకు ఉపయోగపడతాయి. మలబద్ధకం సమస్యను నివారిస్తాయి.
* ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా గుణాలు రక్తప్రసరణ బాగుండేలా, కొలెస్ట్రాల్‌ లెవెల్‌ సమంగా ఉండేలా చేస్తాయి.
* విటమిన్‌-కె బ్లడ్‌ క్లాట్స్‌ను నివారిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
* బి, సి, ఇ విటమిన్లు విస్తారంగా ఉన్నందున మంచి పోషకాహారం. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఔషధంలా పనిచేయడమే కాదు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్లు రాకుండా చేస్తాయి.
* పొటాషియం రక్తపోటు, హృద్రోగాల బారినుంచి కాపాడుతుంది.
* టోమాటోల్లో ఉన్న కెరొటినాయిడ్స్‌.. లుటిన్‌, లైకోపిన్‌, బెటా కెరోటిన్‌లు కళ్లను సంరక్షిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్