నిమ్మతో మిలమిల!

నిమ్మరసం వల్ల బోలెడు ఉపయోగాలు. ఆరోగ్యాన్నిచ్చే విటమిన్‌-సి, మరెన్నో పోషకాలుంటాయి దీంట్లో. అయితే ఇది ఆరోగ్యాన్ని, అందాన్ని

Published : 22 Jul 2021 01:28 IST

నిమ్మరసం వల్ల బోలెడు ఉపయోగాలు. ఆరోగ్యాన్నిచ్చే విటమిన్‌-సి, మరెన్నో పోషకాలుంటాయి దీంట్లో. అయితే ఇది ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంలోనే కాదు శుభ్రతకీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే వాడేసిన నిమ్మ తొక్కలతో బోలెడు ప్రయోజనాలున్నాయి.

కప్పు నిమ్మ తొక్కలను అర లీటరు నీటిలో వేసి చిన్న మంటపై పదినిమిషాలు బాగా మరిగించాలి. తర్వాత తొనలను ఆ నీటిలోనే పిండేయాలి. ఈ నీటిని వడకట్టి స్ప్రే సీసాలోకి ముప్పావు వంతు తీసుకోవాలి. ఈ నీటిలో అర చెంచా చొప్పున డిష్‌వాష్‌, వంటసోడాను కలపాలి. అంతే క్లీనర్‌ సిద్ధమైనట్లే.

ఈ క్లీనర్‌...

* మురికి, మొండి మరకలను తొలగిస్తుంది. * టైల్స్‌ను శుభ్రం చేయొచ్చు.* స్టీలు పాత్రలను కడగొచ్చు. * గ్యాసు స్టవ్‌, వంటబండను శుభ్రం చేయొచ్చు. * కారును మెరిపించొచ్చు. * ప్లాస్టిక్‌ కుర్చీలు, టేబుళ్లు, వంట గదిలోని బుట్టలను శుభ్రం చేయొచ్చు. * కలపతో చేసిన ఫర్నిచర్‌ను మాత్రం నీటితో తుడవొద్దు. ఇలా చేస్తే చెక్క నీటివల్ల ఉబ్బి పాడవుతుంది. అలాగే ఈ నీటితో అద్దాలను శుభ్రం చేయడం వల్ల మరకలు పడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్