తల్లిపాలకు బొప్పాయి!

కంటికింపైన రంగు, తియ్యని రుచిలో నోరూరిస్తుంది బొప్పాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు. ముఖ్యంగా మహిళలు తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది....

Published : 06 Aug 2021 01:36 IST

కంటికింపైన రంగు, తియ్యని రుచిలో నోరూరిస్తుంది బొప్పాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు. ముఖ్యంగా మహిళలు తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది. 

* అరుగుదల సమస్యలు ఉన్నవారు...బొప్పాయిని తింటే సరి. ఇందులోని పపెయిన్‌ అనే ఎంజైమ్‌ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి బొప్పాయి ముక్కలను వేస్తారు. ఇందులో పీచు శాతమూ ఎక్కువే ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకెళ్లి...చర్మం నిగారింపుతో కనిపిస్తుంది.

* రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఎడిమా వంటి సమస్యలతో బాధపడేవారు బొప్పాయిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ఎ, సి విటమిన్లు, కాపర్‌, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల పోషకాహారలోపమూ తగ్గుతుంది.

* గుండె వ్యాధులు ఉన్నవారు తరచూ బొప్పాయి తీసుకోవడం మంచిది. మధుమేహమూ అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.

* బొప్పాయి ముక్కలను పాలతో కలిపి ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే...బాలింతల్లో పాలు పడతాయి. ఇందులోని పోషకాలు నెలసరి క్రమంగా వచ్చేలా చేస్తాయి. పచ్చిబొప్పాయిని రుతురోజుల్లో మినహా మిగిలిన సమయంలో తింటే...గర్భాశయం ఆరోగ్యంగానూ ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్