వ్యాయామం చేసేద్దాం...

అందంగా కనిపించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా... తీసుకున్న ఆహారానికి తగ్గ వ్యాయామం శరీరానికి అందాల్సిందే. రేపట్నుంచి ఎలాగైనా ఎక్సర్‌సైజులు చేసి తీరతా...

Published : 07 Aug 2021 03:01 IST

అందంగా కనిపించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా... తీసుకున్న ఆహారానికి తగ్గ వ్యాయామం శరీరానికి అందాల్సిందే. రేపట్నుంచి ఎలాగైనా ఎక్సర్‌సైజులు చేసి తీరతా... అని చాలా సార్లే అనుకుని ఉంటాం. కానీ ఆచరణలో మాత్రం కనిపించదు. ఆ జాబితాలో మీరూ ఉంటే ఈ చిట్కాలు పాటించండి.

వ్యాయామాల్ని మొదట్లో వీలైనంత సరదాగా చేసేవి ఎంచుకోవాలి. అంటే...ఆటలు ఆడటం, పరుగులెత్తడం, తాడాట, డ్యాన్స్‌ వంటివన్నీ ఉత్సాహాన్నిచ్చేవే. ఇవన్నీ చేయాలంటే ముందు నిద్రలేవాలిగా అంటారా? కొన్నిరోజులు సాయంత్రం టైమ్‌ కేటాయించుకోండి. అలవాటు పడ్డాక ఉదయం చేయొచ్చు.

* ఉదయం ఆరుగంటలకు నడకకు వెళ్లాలనుకుంటే... ఆ సమయానికి  ఓ అరగంట ముందే అలారం పెట్టండి. లేచిన వెంటనే కాస్త బద్ధకం తీరాలన్నా, శరీరం అనుకూలంగా మారాలన్నా ఈ సమయం అవసరం. అంతేకాదు... తగినంత నిద్ర కూడా ఉండాలి. అప్పుడే శరీరం, మనసు రెండూ సహకరిస్తాయి.

* ఒక్కసారే ఏ పని చేయాలన్నా భారంగా భావిస్తుంటాం. నిజానికి వ్యాయామం చేయడానికి ముహూర్తం అవసరం లేదు. శరీరానికి శ్రమను అలవాటు చేయాలంటే... ఇంటి పనితోనే మొదలుపెట్టండి. ఇంటిని తుడవడానికి కర్రను కాకుండా... వస్త్రాన్ని వాడండి. త్వరగానే చెమట పడుతుంది. అయితే దీన్ని ఆదరాబాదరాగా కాకుండా... తీరిగ్గా చేయండి. క్రమంగా శరీరం సౌకర్యంగా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్