కంటినిండా నిద్ర కావాలా?

రాత్రిళ్లు సరిగా నిద్రపట్టట్లేదా... కునుకు కంటిపాపను చేరనంటుందా... కంటినిండా నిద్ర పోవాలనుకుంటున్నారా... అయితే ఈ యోగాసనాలు ప్రయత్నించి చూడండి. వీటి ద్వారా ఒత్తిడి తగ్గి శరీరం, మనసు ప్రశాంతంగా మారతాయి.. వీటన్నింటితోపాటు కంటినిండా నిద్ర మీ సొంతమవుతుంది.

Published : 04 Sep 2021 02:24 IST

రాత్రిళ్లు సరిగా నిద్రపట్టట్లేదా... కునుకు కంటిపాపను చేరనంటుందా... కంటినిండా నిద్ర పోవాలనుకుంటున్నారా... అయితే ఈ యోగాసనాలు ప్రయత్నించి చూడండి. వీటి ద్వారా ఒత్తిడి తగ్గి శరీరం, మనసు ప్రశాంతంగా మారతాయి.. వీటన్నింటితోపాటు కంటినిండా నిద్ర మీ సొంతమవుతుంది.

శవాసనం.... మ్యాట్‌పై కాళ్లు, చేతులు చాపి వెల్లకిలా పడుకోవాలి. శరీరాన్ని పూర్తి విశ్రాంత స్థితిలో ఉంచాలి. శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఎలాంటి ఆలోచనలనూ మనసులోకి రానీయకుండా ఓ రెండు మూడు నిమిషాలు ఈ స్థితిలో ఉండి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది.

హలాసనం... మ్యాట్‌పై పడుకుని నేలపై చేతులను సమాంతరంగా చాపాలి.  ఇప్పుడు నడుము కింది భాగాన్ని మెల్లిగా పైకి లేపుతూ చిత్రంలో చూపిన విధంగా తలకు పై భాగంలో కాళ్లను తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి.

ఉత్తానాసనం.. ముందుగా నిటారుగా నిల్చొవాలి.  ఇప్పుడు చేతులను కిందకు దించుతూ, మోకాళ్లను వంచకుండా నేలను తాకించాలి. తలనూ మోకాళ్ల వరకు తీసుకురావాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్