ఆహారమే కొరియన్ల ఆరోగ్య రహస్యం...

కొరియన్‌ మహిళల ఆరోగ్యం, అందం వెనుక రహస్యం వాళ్ల ఆహారమే అంటున్నారు నిపుణులు. ‘కే-పాప్‌ వెయిట్‌ లాస్‌ డైట్‌’గా ప్రాముఖ్యత పొందుతున్న వీరి ఆహార నియమాలను మనమూ తెలుసుకుందామా...

Published : 25 Oct 2021 02:09 IST

కొరియన్‌ మహిళల ఆరోగ్యం, అందం వెనుక రహస్యం వాళ్ల ఆహారమే అంటున్నారు నిపుణులు. ‘కే-పాప్‌ వెయిట్‌ లాస్‌ డైట్‌’గా ప్రాముఖ్యత పొందుతున్న వీరి ఆహార నియమాలను మనమూ తెలుసుకుందామా...

* పీచు, పోషక విలువలు ఎక్కువగా ఉండే పదార్థాలకు కొరియన్‌ మహిళలు ప్రాధాన్యం ఇస్తారు. ఇవి జీర్ణమవడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ, త్వరగా ఆకలి వేయనివ్వవు. అధిక కెలొరీలను అందించి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. పరిపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఈ తరహా ఆహార విధానంతో జీర్ణశక్తి కూడా మెరుగ్గా ఉంటుంది. రక్తపోటు, బ్లడ్‌ షుగర్‌, చెడు కొలెస్ట్రాల్‌ వంటి అనారోగ్యాలు దరిచేరవు. ఇవన్నీ వారి చర్మం నిగారింపుగా కనిపించేలా చేస్తాయి.

* కొరియన్లు సాంప్రదాయ ఆహార పద్ధతులకు పెద్దపీట వేస్తారు. తాజా కూరగాయలకు ప్రాధాన్యం ఇస్తారు. అన్నంతోపాటు కిమ్చీగా పిలిచే పులియబెట్టిన క్యాబేజీని తీసుకుంటారు. అలాగే కోడిగుడ్లు, మాంసాహారం, చేపలు, గోధుమలు లేకుండా చేసే పాన్‌కేక్స్‌, నూడిల్స్‌ వీరి ఆహారంలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆవిరిపై ఉడికించిన కూరగాయలతో భోజనాన్ని ముగిస్తారు.పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీం, రొట్టె, పాస్తా, వేపుళ్లు, నూనెతో చేసే పదార్థాలకు దూరంగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్