మతిమరుపు దూరం కావాలంటే...

విమల ఇల్లు, బీరువా తాళాలు భద్రంగానే దాస్తుంది. కానీ ఎక్కడపెట్టిందో అకస్మాత్తుగా మర్చిపోతుంది. కూరలో ఉప్పు వేశానా లేదా అన్న సందేహంతో మళ్లీ రుచి చూడాల్సి వస్తోంది. పిల్లల వస్తువుల విషయంలోనూ ఇదే పరిస్థితి. అకస్మాత్తుగా ఈ మతిమరుపేంటా అని ఆందోళన పడుతోంది.

Published : 19 May 2022 00:58 IST

విమల ఇల్లు, బీరువా తాళాలు భద్రంగానే దాస్తుంది. కానీ ఎక్కడపెట్టిందో అకస్మాత్తుగా మర్చిపోతుంది. కూరలో ఉప్పు వేశానా లేదా అన్న సందేహంతో మళ్లీ రుచి చూడాల్సి వస్తోంది. పిల్లల వస్తువుల విషయంలోనూ ఇదే పరిస్థితి. అకస్మాత్తుగా ఈ మతిమరుపేంటా అని ఆందోళన పడుతోంది. కొన్నిసార్లు ఇలా జరిగినంత మాత్రాన కంగారు వద్దంటున్నారు నిపుణులు. దీన్నుంచి దూరం కావడానికి చిట్కాలనూ చెబుతున్నారు.

కొందరు ఎదురుపడిన వ్యక్తి బాగా తెలిసినవారైనా కూడా ఒక్కోసారి పేరు మర్చిపోతుంటారు. కొన్నిసార్లు చదివిన పుస్తకం పేరు గుర్తుండదు. కొంతసేపటికి గుర్తుకొస్తుంది. అంటే అది మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. మనకు చేర్చడానికి ఆలస్యంకావొచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే మానసిక శక్తిని పెంపొందించుకోవాలి. శరీరానికి తగిన వ్యాయామాన్ని అందిస్తే శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి మెదడు చురుకుగా మారుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. కావాల్సిన అంశం మెదడు మనకు వెంటనే అందించడానికి సంసిద్ధంగా ఉంటుంది. వారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్‌ యాక్టివిటీ అవసరమని చెప్పింది ఓ అధ్యయనం. ఇందులో జాగింగ్‌, బ్రిస్క్‌ వాకింగ్‌ ఉంటే మంచిదంటున్నారు నిపుణులు. అలా వీలుకానివారు రోజూ సమయం దొరికినప్పుడు పది నిమిషాలు అటూ ఇటూ అడుగులు వేసినా ఫరవాలేదంటున్నారు.

మానసికంగా... శరీరంతోపాటు మానసిక ఉత్సాహం అతి ముఖ్యమైంది. ఇందుకోసం క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ చేయాలి. వాహనంపై వెళ్లేటప్పుడు కొత్త దారుల్లో వెళ్లేందుకు ప్రయత్నించడం వంటివి చేయాలి. ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం, సంగీత వాయిద్యం శిక్షణ తీసుకోవడం వంటివి కూడా మనసును ఉత్తేజ పరుస్తాయి. పిల్లలతో కలసి మెదడుకు పనిచెప్పే ఆటలను కాసేపు ఆడాలి. దాంతో వాళ్లు కూడా ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా కొత్త వంటను ప్రయత్నించాలి. ఏదైనా స్వచ్ఛంద సంస్థతో కలిసి సామాజిక సేవలో భాగమైనా చాలు. మనసు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి తిరిగి పుంజుకొంటుంది. నిద్రలేమి కూడా కొన్నిసార్లు మతిమరుపును తెచ్చిపెడుతుంది. ఇల్లు, ఆఫీస్‌ పనులతో సతమతమయ్యే మహిళలకు వైద్యులు ఇస్తున్న సూచనేంటంటే కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. అప్పుడే మెదడుకు కావాల్సినంత విశ్రాంతి దొరికి తిరిగి ఉత్సాహంగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్