వ్యర్థాలను తొలగించేస్తాయి..

జీవన శైలి, ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల కిడ్నీ సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. ఎండలూ ఎక్కువవడంతో మరింత అప్రమత్తంగా ఉండాలి. మూత్రపిండాలని ఆరోగ్యంగా ఉంచే పోషకాహారమిది.. తిప్పతీగ... ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు శరీరంలోని మలినాలను తొలగించి మూత్రపిండాలు పాడవకుండా చేస్తాయి.

Updated : 16 Mar 2023 08:57 IST

జీవన శైలి, ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల కిడ్నీ సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. ఎండలూ ఎక్కువవడంతో మరింత అప్రమత్తంగా ఉండాలి. మూత్రపిండాలని ఆరోగ్యంగా ఉంచే పోషకాహారమిది..

తిప్పతీగ... ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు శరీరంలోని మలినాలను తొలగించి మూత్రపిండాలు పాడవకుండా చేస్తాయి.
అల్లం.. ఇంట్లో తేలిగ్గా దొరికే అల్లం కిడ్నీలకు మేలు చేకూర్చడంలో ముందుంటుంది. ఇది వాపు తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే నొప్పినీ మటుమాయం చేస్తుంది.

త్రిఫల...  దీన్ని కషాయంలా తాగొచ్చు.  రాత్రివేళల్లో పాలు లేదా తేనెతో కలిపి తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది.

పునర్నవ... ఈ ఆకుకూర కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచి, మెరుగ్గా పనిచేయటానికి కావాల్సిన పోషణనిస్తుంది.

ఆల్‌బుకరా పండ్లు... దీనిలోని యాంటీలిథోజెనిక్‌ గుణాలు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి. వీటిని నేరుగా  తినొచ్చు. లేదా సలాడ్లు, ఓట్‌మీల్‌లో వేసుకొని తినవచ్చు.  తరచూ వీటిని తీసుకోవటం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్