మీకోసమే.. ఆ సమయం!
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే... ఇంటి పనులు, వ్యక్తిగత సమయం కేటాయించుకునే వరకూ ప్రణాళికాబద్ధంగా లేకపోతే రుసరుసలు తప్పవు. ఆ వాదనలు కాస్తా ముదిరితే ఇంటి
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే... ఇంటి పనులు, వ్యక్తిగత సమయం కేటాయించుకునే వరకూ ప్రణాళికాబద్ధంగా లేకపోతే రుసరుసలు తప్పవు. ఆ వాదనలు కాస్తా ముదిరితే ఇంటి వాతావారణం దెబ్బతింటుంది. అలాకాకూడదంటే...
* ఇద్దరూ వేర్వేరు షిప్ట్‌ల్లో వెళ్తున్నాం.... ఇంటికొచ్చాక అలసట. దాంతో ముఖాలు చూసుకునే తీరిక కూడా ఉండట్లేదు అంటారు కొందరు. అదే మీ ఇబ్బంది అయితే వీలైతే మీ ఇద్దరి వారాంతపు లవు ఒకే రోజు ఉండేలా చూసుకోండి. కానీ చాలామందిలా మీరూ ఆ రోజుని విశ్రాంతి దినంగా భావించొద్దు. పనులు, నిద్ర అన్నీ పూర్తిచేసుకున్నాక మీ కోసం మీరు ఓ గంటా రెండు గంటలు కేటాయించుకోండి. కుదరకపోతే నెలకోసారైనా ఒకరి వారాంతం రోజున మరొకరు సెలవు పెట్టుకుని కలిసి గడపండి. ఆ సమయంలో బయట విషయాల కంటే ఇద్దరికీ సంబంధించిన అంశాలను మాత్రమే చర్చించుకుంటే అభద్రత దరిచేరదు.
* ఇంటి పనులు, ఆర్థిక విషయాల్లో ఒక్క మాటమీద నడిస్తే మేలు. బాధ్యతల్ని పక్కవారి మీదకు నెట్టే ప్రయత్నం చేయొద్దు. పనులు విభజించుకుని పంచుకోండి. ఎవరిపనులు వారు చేస్తే మరొకరి మీద భారం పడదు. అలానే పదే పదే ఎదుటివారి పనుల్లో లోపాల్ని ఎత్తిచూపడం సరికాదు. వీలైతే... వాటిని పరిహరించడానికి మీవంతు సాయం చేయండి. ఇవన్నీ మీ జీవితం చక్కగా సాగిపోవడానికి సాయపడతాయి.
* జీవనశైలిపై ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. వాటితో చాలా సమయమే వృథా అవుతుంది. అందుకే మీరు కలిసి ఉన్న సమయంలో ఓ గంట ఫోన్లను ఆఫ్ చేయండి. పూర్తిగా ఆఫ్ చేయలేకపోతే సైలెంట్‌లో పెట్టండి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లకు దూరంగా ఉండండి. అప్పుడు కచ్చితంగా భాగస్వామి కోసం నాణ్యమైన సమయాన్ని కేటాయించగలరు. అలానే ఆ సమయాన్ని కలిసి వ్యాయామం చేయడానికో, తోటపని చేయడానికో వాడితే సంతోషంగానూ ఉండగలరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- నిమ్మతో నిగనిగలాడే అందం..!
- వీపు మీద పొక్కులా..?
- Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!
- ఎండల్లోనూ... తాజాగా
- మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి...
ఆరోగ్యమస్తు
- వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
- వైట్‌డిశ్చార్జ్ అవుతుంటే..!
- నడక నేర్చుకుంటూనే!
- సంపూర్ణ ఆరోగ్యం.. ఇలా సొంతం!
- నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా?
అనుబంధం
- నువ్వే సర్వస్వం అన్నాడు.. అక్కడికెళ్లాక మాట మార్చాడు..!
- ఆడేద్దామా తొక్కుడు బిళ్ల
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
- పాట్లక్తో...
- నాన్నంటే భయపడుతున్నారు..!
యూత్ కార్నర్
- డూడుల్ డబ్బా అదిరిందబ్బా!
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
'స్వీట్' హోం
- రాగి పాత్రలు మెరిసేలా..!
- పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
వర్క్ & లైఫ్
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!