అజమాయిషీ వద్దు!

ఎదిగిన బిడ్డలు తమ మాట వినట్లేందంటూ చాలామంది తల్లిదండ్రుల ఫిర్యాదులు వింటుంటాం. అలాగని అతిగా అజమాయిషీ చేస్తే... మరింత మొండిగా మారతారు. మరేం చేయాలి అంటారా?

Published : 30 Jun 2021 01:34 IST

ఎదిగిన బిడ్డలు తమ మాట వినట్లేందంటూ చాలామంది తల్లిదండ్రుల ఫిర్యాదులు వింటుంటాం. అలాగని అతిగా అజమాయిషీ చేస్తే... మరింత మొండిగా మారతారు. మరేం చేయాలి అంటారా?

మీకెంత తీరిక లేకున్నా రోజులో కొంత సమయాన్ని పిల్లలతో గడపడానికి కేటాయించడం తప్పనిసరి. ఈ సమయాన్ని మీకనుకూలంగా మార్చుకోవడానికి వారు తమ భావాలను మీతో పంచుకునేలా ప్రోత్సహించండి. ఇంటి పనులు చేస్తున్నప్పుడో, మార్కెట్‌కు వెళ్తున్నప్పుడో మీకు సాయంగా ఉండమనండి. మాటలు కలపండి. ఆప్యాయంగా చెప్పే కబుర్లు వారిని మీకు మరింత దగ్గర చేస్తాయి.

* మీ అభిరుచుల్ని వారితో పంచుకోండి. దానిలో విభిన్నత కోసం వారి నుంచి సలహాలను స్వీకరించండి. ఈ క్రమంలో వారి ప్రయోగాలను అభినందించండి. ఇవన్నీ వారు మీతో ఎక్కువ సమయం గడిపేలా చేస్తాయి.

* ఏ సమస్య అయినా నేరుగా చర్చించండి. ముభావంగా ఉండటం, కసురుకోవడం వంటి వాటి వల్ల వారిపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎదిగిన పిల్లలు ప్రతిదీ తమతో పంచుకోవాలని ఆశించడం సబబే కానీ అదే పనిగా ప్రశ్నించవద్దు. దీని వల్ల వారు మీపై నమ్మకాన్ని కోల్పోతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్