చిన్నప్పుడే నేర్పకపోతే...

అమ్మానాన్నలు పనిచేస్తోంటే ఐదారేళ్ల పిల్లలు కుతూహలంగా చూస్తారు. కూరలు తరుగుతుంటే ‘నేను చేస్తా’ అంటూ వచ్చేసి కత్తి లాక్కోబోతారు. కిరాణా కొట్టుకు వెళ్తుంటే వెంట వచ్చేస్తారు. బట్టలు ఆరేస్తోంటే పరిగెత్తుకొస్తారు.

Published : 01 Jul 2021 00:54 IST

అమ్మానాన్నలు పనిచేస్తోంటే ఐదారేళ్ల పిల్లలు కుతూహలంగా చూస్తారు. కూరలు తరుగుతుంటే ‘నేను చేస్తా’ అంటూ వచ్చేసి కత్తి లాక్కోబోతారు. కిరాణా కొట్టుకు వెళ్తుంటే వెంట వచ్చేస్తారు. బట్టలు ఆరేస్తోంటే పరిగెత్తుకొస్తారు. ఇలా ప్రతి పనీ చేస్తామంటూ లాక్కోబోతారు. కానీ చాకుతో చేయి తెగుతుంది, స్టవ్వు మంట అంటుకుంటుంది, ఎండలోకి వస్తే అలసిపోతారు లాంటి భయాలతో పంపేస్తారు. ఇంకొంత వయసు పెరిగాక ఇంటి పనుల దేముంది ఎప్పుడైనా చేసుకోవచ్చు.. చదువుకు ఆటంకం రాకూడదు, మార్కులు తగ్గకూడదని పనులన్నీ తామే చేసుకుంటారు. కానీ పిల్లలకు పనులు అలవాటు చేయమంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే...
* చిన్నతనంలో వద్దని వారిస్తే ఆనక వాళ్ల దృష్టి ఇటువైపు మళ్లించాలన్నా మళ్లదు.
* చిన్నారులు ఇబ్బందిలో పడే లేదా ప్రమాదాలు కొనితెచ్చుకునే మాట నిజమే. అలాగని వేటి జోలికీ రానివ్వకపోతే ఏమీ నేర్చుకోలేరు. కనుక పెద్దలు వెన్నంటి ఉంటూ జాగ్రత్తలు చెబుతూ, సులువైన పద్ధతులు వివరిస్తూ పనులు నెమ్మదిగా అలవాటు చేయాలి.
*భోజనాలయ్యాక డైనింగ్‌టేబుల్‌ తుడవటం, ఆరిన దుస్తులు మడతపెట్టడం, తెచ్చిన సరుకులు ఎక్కడివక్కడ సర్దడం, అతిథులు వచ్చినప్పుడు మంచినీళ్లు ఇవ్వడం, తమ వస్తువులు నీట్‌గా సర్దుకోవడం లాంటి పనులు చిన్నతనంలోనే నేర్పించాలి.
* ఆ పనులు చక్కగా చేసినప్పుడు ప్రశంసించడం చాలా ముఖ్యం. దాంతో వాళ్లకి ఇంకా చేయాలన్న ఉత్సాహం వస్తుంది.
* బయటకు వెళ్లేటప్పుడు వెంట తీసికెళ్తే ఆయా పనులు చూస్తూ వాళ్లూ కొద్దికొద్దిగా నేర్చుకుంటారు.
* చిన్నతనంలో అన్నిటికీ అవరోధాలు కల్పించి పెద్దయ్యాక ఒకేసారి నేర్చుకోమంటే తమకు సంబంధం లేని విషయాల్లా తోస్తాయి. భవిష్యత్తులో ఆ పనులు చేయడం తప్పనిసరి అయినప్పుడు విసుగూ దుఃఖాలు ముంచుకొస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్