Published : 09/08/2021 01:07 IST

సమన్వయం చేసుకోండి

ఉద్యోగినుల జీవితం రెండు పడవలపై ప్రయాణం లాంటిది. జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ తాకొచ్చు. కఠోరశ్రమ, నిబద్ధత, సమయపాలన అనేవి ఉద్యోగినులు తప్పనిసరిగా పాటించాల్సినవి.

ఆరోగ్యం... ఇంటిని, ఆఫీసును బ్యాలెన్స్‌ చేయాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. అందుకు ఆరోగ్యకర అలవాట్లు, నిద్రకు ప్రణాళికను రూపొందించుకోవాలి. దాన్ని కచ్చితంగా పాటించాలి. లేదంటే మానసికంగా, శారీరకంగా బలహీనమై పోతారు. దాంతో ఎక్కడలేని ఒత్తిడికి గురవుతారు. ఈ స్థితిలో ఇల్లూ, ఆఫీసు.. రెంటికీ న్యాయం చేయలేరు. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త.

భాగస్వామితో... ఆఫీసు, ఇంటి పనులు, పిల్లలు... ఇలా ఎక్కువ భారం మీపై పడుతున్నట్లు అనిపిస్తే పరిస్థితులను శ్రీవారికి విడమరచి చెప్పండి. అప్పుడే మీకు వారి నుంచి కావాల్సిన సాయం అందుతుంది.

మీకంటూ కొంత... విరామం లేకుండా పనులు చేస్తూ వెళ్లొద్దు. మధ్యలో స్వల్ప విరామాలు చాలా అవసరం. ఇవి మీ ఉత్పాదకతను పెంచుతాయి. మీకు నచ్చిన వంటకాన్ని చేయడమో, ధ్యానం, అభిరుచులకు మరింత సానబెట్టడం... ఇలా ఏదో ఒక పనిచేస్తూ బిజీగా ఉండాలి. ఇవి మిమ్మల్ని సంతోషంగా, ఆనందంగా ఉండేలా చేస్తాయి.

హద్దులు... ఆఫీసుకు, ఇంటికి మధ్య కచ్చితమైన హద్దులు నిర్ణయించుకోండి. అప్పుడే సమర్థంగా వ్యవహరించలుగుతారు. అవసరమైతే అదనపు గంటలు ఉండి పని పూర్తి చేయాలి. మిత్రులు, కొలీగ్స్‌తో అనవసరపు చిట్‌చాట్‌తో సమయాన్ని వృథా చేయొద్దు.

వారికి దూరం... కొందరు మనతో ఎప్పుడూ ప్రతికూలంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. సమస్యలతో సతమతమవుతూ ఉండే మీరు అలాంటి వారి మాటలు వింటే మరిన్ని ఇబ్బందులు వెంటాడుతాయి.

సాయం... ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల సాయం తీసుకోవడంలో తప్పు లేదు. దీనికి మొహమాటపడొద్దు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని