వీలైతే ఓ పొగడ్త!

అంతవరకూ మన కొంగు పట్టుకుని తిరిగిన పిల్లలే! అదేంటో చిత్రంగా టీనేజీలోకి అడుగు పెట్టగానే దూరం అయిపోతారు. అంతా మాకు తెలుసంటారు. ఏదైనా చెబితే విసుక్కుంటారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక సతమతవుతున్నారా?....

Updated : 12 Aug 2021 04:32 IST

అంతవరకూ మన కొంగు పట్టుకుని తిరిగిన పిల్లలే! అదేంటో చిత్రంగా టీనేజీలోకి అడుగు పెట్టగానే దూరం అయిపోతారు. అంతా మాకు తెలుసంటారు. ఏదైనా చెబితే విసుక్కుంటారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక సతమతవుతున్నారా?

ఇంట్లో మిలిటరీ రూల్స్‌ పెట్టి వాటిని పిల్లలు ఫాలో అవ్వాలని అనుకోకండి. అవంటే వాళ్లకు అస్సలు గిట్టదు. కఠిన నిబంధనలు ప్రతికూల ఫలితాలనే ఇస్తాయి.

‘ఎక్కడికి వెళ్లావ్‌?’ ‘ఎందుకెళ్లావ్‌’, ‘ఎప్పుడొస్తావ్‌...’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించకండి. ఆ వయసులో ప్రశ్నలని వాళ్లు ఇష్టపడరు. వాళ్లు చెప్పినప్పుడు ఆసక్తిగా వినండి. అందులోనే మీ ప్రశ్నలకు సమాధానం దొరకొచ్చు.

తల్లిదండ్రులమనే హక్కుతో చీటికీమాటికీ వాళ్ల మీద అధికారం చెలాయించాలని చూడొద్దు. ఇది వాళ్ల మానసికస్థితిని ప్రభావితం చేస్తుంది. వాళ్లకేదయినా కష్టం వస్తే ‘నేను చెప్పానా...’ అంటూ సమయం వచ్చింది కదాని దెప్పిపొడుపులొద్దు. సున్నితంగానే ఆ కష్టం నుంచి బయటపడే మార్గం చెప్పండి.

వీలు చిక్కినప్పుడల్లా మీ ప్రేమను వ్యక్తపరచండి. సమయం వచ్చినప్పుడు ఓసారి పొగిడి చూడండి. అంతేకానీ.. ‘బిడ్డలని పొగడకూడదు, దిష్టి తగులుగుతుంది’ లాంటి భావనలని పక్కనపెట్టండి. ఆ చిన్న పొగడ్త వారికి కొండంత ఆత్మవిశ్వాసాన్నిస్తుంది.    

అడిగిందల్లా ఇవ్వొద్దు. ముఖ్యంగా డబ్బు విలువ తెలుసుకోవాల్సింది ఈ వయసులోనే. డబ్బునీ, స్నేహాల్నీ, ఈ వయసులో ఉండే ఆకర్షణలనీ దేనినీ వద్దు అనొద్దు. ఆ దారిలో వెళ్తే ఎదురయ్యే ఇబ్బందులేంటో చెప్పండి. వాళ్లే అర్థం చేసుకుంటారు.

‘ఇలా చేయ్‌’ ‘అలా చెయ్‌’ అంటూ చెవిలో ఇల్లు కట్టుకోవద్దు. మీ జీవితంలో మీకు ఎదురయిన అనుభవాలనే చెప్పండి. అవే వాళ్లకు పాఠాలు అవుతాయి.

‘బండగా తయారవుతున్నావ్‌’, ‘బద్ధకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ నువ్వు’ ఇలా తిట్టొద్దు.. అవి వాళ్ల మనసుని గాయపరుస్తాయి. వాళ్లతో స్నేహితుల్లా మెలిగితేనే మార్పు సాధ్యమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్