అవే దూరానికి కారణం...

చిన్నచిన్న సమస్యలే భార్య భర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. అలాంటివి నిబ్బరంగా ఎదుర్కోవాలంటే ఇద్దరూ పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి....

Published : 24 Sep 2021 01:02 IST

చిన్నచిన్న సమస్యలే భార్య భర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. అలాంటివి నిబ్బరంగా ఎదుర్కోవాలంటే ఇద్దరూ పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి.

ళ్లు గడిచేకొద్దీ కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్యా అనుబంధం కొంత తగ్గుతుంది. బాధ్యతలు పెరగడం, పని ఒత్తిడి కారణం కావచ్చు. దాంతో ఇద్దరిలో సహనం సన్నగిల్లుతుంది. చిన్న చిన్న విషయాలకే రుసరుసలు, చిరాకులూ మొదలవుతాయి. ఇలాంటివి పెరగకుండా ఉండాలంటే.. పెళ్లయిన కొత్తల్లో మీరెలా ఉండేవారో గుర్తుచేసుకుని మళ్లీ అలా ఉండేందుకు ప్రయత్నించండి. కుదిరితే ఆ సరదా ముచ్చట్లూ, సందర్భాలను ఓచోట రాసుకుని మళ్లీ పాటించండి.

* భాగస్వామి కాబట్టి మీ గురించి రెండో వారికి అన్నీ తెలుసనుకుని ఆసక్తులూ, అభిప్రాయాలూ చెప్పడం మానేస్తుంటారు చాలామంది. అది అన్నిసార్లు కాకపోవచ్చు. చాలాసార్లు మీరనుకున్నట్లు జరగకపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు మీ ఆలోచనలూ, ఆసక్తుల్ని, అభిరుచుల్నీ భాగస్వామికి తెలియజేయాలి. దానివల్ల మీ ఇద్దరి అనుబంధం పెరుగుతుంది. ఆ తరవాత..

* మీ భాగస్వామి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు మారే వారి ఆలోచనలు, ఆసక్తులూ, అభిప్రాయాలూ అన్నింటినీ గుర్తించండి. ఇవన్నీ మీరు మీ భాగస్వామిపై చూపించే శ్రద్ధను తెలియ జేస్తాయి. చిన్నచిన్న సమస్యల్నీ తగిస్తాయి.

* ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఒకరి కష్టసుఖాలు మరొకరు తెలుసుకుని పంచుకోవాలి. అది వారానికోసారయినా సరే. ఆ పనుల్లో పడి మీరిద్దరూ ఎంతసేపు గడిపారనేది చర్చించుకోవాలి. అప్పుడే రాబోయే వారాన్ని ఇంకా ఎలా మెరుగు పరచుకోవచ్చనే స్పష్టత ఇద్దరికీ వస్తుంది.

* నెలా, రెణ్నెల్ల తరవాత మీరిద్దరికీ కాస్త సమయం దొరికింది. హోటల్‌కి వెళ్లి భోంచేయడం, సినిమా చూడటం.. ఎప్పుడూ ఉండేవే కాబట్టి కలిసి ఏకాంతంగా గడిపే ప్రాంతాలకు వెళ్లిపోండి. ఓ రోజంతా ఇద్దరే గడపండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్