చొరవ నేర్పిద్దాం!

కరోనా వల్ల జీవన శైలీ మారింది. చాలా మంది పిల్లలు ఆన్లైన్‌ క్లాసులు, వీడియో గేములతో ఒంటరిగానే గడిపేశారు. ఇప్పుడు పరిస్థితులు మారినా ....

Updated : 01 Oct 2021 03:38 IST

కరోనా వల్ల జీవన శైలీ మారింది. చాలా మంది పిల్లలు ఆన్లైన్‌ క్లాసులు, వీడియో గేములతో ఒంటరిగానే గడిపేశారు. ఇప్పుడు పరిస్థితులు మారినా ఆ ఒంటరి తనం దుష్ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. అలా కాకూడదంటే వారికి చొరవను అలవరచాలి...

* పిల్లలకు స్నేహితులు తోడయ్యేది ఆటల్లోనే. అవే వారిలో చొరవను పెంపొందిస్తాయి. అప్పుడే గెలుపోటముల సవాల్‌ కూడా పరిచయం అవుతుంది. ఆటల్లోని స్ఫూర్తిని వారికి అందించండి. వారి స్నేహితులకు చిన్న చిన్న ఆటల పోటీలు పెట్టి చాక్లెట్లూ, బిస్కెట్‌లూ, బొమ్మలు బహుమతులుగా ఇవ్వండి. వాటి రుచితో పాటు స్నేహమాధుర్యం అర్థం అవుతుంది.

* చిన్నారుల చిట్టి బుర్రలు వికసించాలంటే నలుగురితోనూ కలవాలి. ఇందుకు వారి ఫ్రెండ్స్‌తో జూమ్‌, కాన్ఫరెన్స్‌ కాల్స్‌ వంటివి చేయించండి. కాసేపు వారు మాట్లాడుకునే స్వేచ్ఛ కల్పించండి. ఇవన్నీ మనోవికాసానికి దారి చూపుతాయి. 

*  పిల్లలు సామాజిక వేడుకలూ, ఇతర కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేయండి. అలానే తమ పాతవస్తువులూ, దుస్తులను పడేయకుండా ఇతరులకు పంచే సేవాగుణాన్ని అలవాటు చేయండి. తమ వస్తువుల్ని ఇతరులతో పంచుకునే ఔదార్యాన్ని పెంపొందించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్