పసి మనసుల్ని గెలవాలంటే..
ఐశ్వర్య తన తొమ్మిదేళ్ల పాప నిత్యను ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటుంది. అయినా కూతురు మాత్రం తన స్నేహితుల తల్లిదండ్రుల్లా ఉండటం లేదంటోంది. తనని ఎలా సంతోషంగా ఉంచాలో,
ఐశ్వర్య తన తొమ్మిదేళ్ల పాప నిత్యను ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటుంది. అయినా కూతురు మాత్రం తన స్నేహితుల తల్లిదండ్రుల్లా ఉండటం లేదంటోంది. తనని ఎలా సంతోషంగా ఉంచాలో, ఆ పాపాయి మనసులో స్థానం ఎలా సంపాదించాలో ఐశ్వర్యకు అర్థంకావడంలేదు. పిల్లల అవసరాలను తీర్చడం మాత్రమే బాధ్యత అనుకోవడం పొరపాటు అంటున్నారు మానసిక వైద్యనిపుణులు. వారి మనసును అర్థం చేసుకోవడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటంటే...
రోల్‌మోడల్‌గా... ఉదయం నిద్రలేవాలి, సమయపాలన పాటించాలంటూ పిల్లలకు పాఠంలా చెప్పకుండా, ముందుగా తల్లిదండ్రులు వాటిని పాటించాలి. సమయాన్ని వృథా చేయకుండా ఎలా వినియోగించుకోవాలో చిన్నారులు చూసి నేర్చుకునేలా పెద్దలు ప్రవర్తించాలి. మీ నుంచి మంచి మాటతీరు, సమయ స్ఫూర్తి, జీవననైపుణ్యాలు వంటి లక్షణాలను ఒంటపట్టించుకునేది ఈ చిన్న వయసులోనే. మీరు రోల్ మోడల్‌గా నిలవాలంటే ముందు మీరు క్రమశిక్షణ అలవరుచుకోవాలి.
వారు చెప్పేది వింటే... పిల్లలను ఏ తల్లిదండ్రులైనా ప్రేమిస్తారు.. మేమూ అంతే.. అని అక్కడితో ఆగిపోకండి. మీకు వారి మీద ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉందని చెప్పేలా ప్రవర్తించండి. వాళ్ల కోసం సమయం కేటాయించడం, వారు చెప్పే ప్రతి విషయాన్ని పూర్తిగా వినడం, సరైన సలహాలు ఇవ్వడం, స్నేహితులుగా మెలగడం వంటిపనులతో మీతో ఉన్న సాన్నిహిత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు మిమ్మల్ని వారు కూడా ప్రేమించడం మొదలుపెడతారు. తమ సమస్యలను చెబితే, వాటికి పరిష్కారం దొరుకుతుందనే ధైర్యం, భరోసా మీ నుంచి పొందుతారు.
సానుకూలంగా... చిన్నప్పటి నుంచే పంచుకునేతత్వాన్ని అలవాటు చేయాలి. నేను, నాది అని కాకుండా మనం అని ఆలోచించే దిశగా వారిని నడిపించాలి. కష్ట, సుఖాలకు స్పందించే తీరుని, భావోద్వేగాలను సమన్వయం చేసుకునే అవసరానీ వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఇవన్నీ వారిలో సానుకూలత్వాన్ని, దయాగుణాన్ని పెంచుతాయి. కుటుంబ విలువలు, మానవ సంబంధాలు వంటివన్నీ చిన్నప్పటి నుంచి చిన్నారులకు ఇంటి నుంచే అలవడాలి. అప్పుడే ప్రతికూలతలకు దూరంగా ఉండగలరు.
ఒత్తిడి అధిగమించేలా... ప్రతి చిన్న విషయానికి ఇంట్లో పెద్దవాళ్లు ఆందోళనకు గురైతే, ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. అది వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. సమస్య పెద్దదైనా, చిన్నదైనా దాన్ని పరిష్కరించుకోవడంలో పాటించే అంశాలు చిన్నారులకు పాఠాలుగా మారతాయి. తోట పెంపకం, పుస్తకపఠనం, క్రీడలపై ఆసక్తిని పెంచడం, స్ఫూర్తిదాయకమైన వారి కథలను వినిపించడం వల్ల వారు ఒత్తిడిని జయించడమెలాగో తెలుసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వీపు మీద పొక్కులా..?
- Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!
- ఎండల్లోనూ... తాజాగా
- మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి...
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
ఆరోగ్యమస్తు
- వైట్‌డిశ్చార్జ్ అవుతుంటే..!
- నడక నేర్చుకుంటూనే!
- సంపూర్ణ ఆరోగ్యం.. ఇలా సొంతం!
- నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా?
- డిప్రెషన్ తగ్గించే పాదాంగుష్ఠాసనం
అనుబంధం
- ఆడేద్దామా తొక్కుడు బిళ్ల
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
- పాట్లక్తో...
- నాన్నంటే భయపడుతున్నారు..!
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
యూత్ కార్నర్
- డూడుల్ డబ్బా అదిరిందబ్బా!
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
'స్వీట్' హోం
- పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
వర్క్ & లైఫ్
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!