ప్రేమతో గెలవండి!

వైవాహిక బంధంలో కలతలు రావడానికీ, అపార్థాలు కలగడానికీ బోలెడు కారణాలు ఉండొచ్చు. వీటన్నింటినీ ప్రేమతో సులువుగానే అధిగమించొచ్చు. అదెలాగంటే...

Updated : 12 Oct 2021 05:27 IST

వైవాహిక బంధంలో కలతలు రావడానికీ, అపార్థాలు కలగడానికీ బోలెడు కారణాలు ఉండొచ్చు. వీటన్నింటినీ ప్రేమతో సులువుగానే అధిగమించొచ్చు. అదెలాగంటే...

చిన్న ప్రశంస: అందరూ మనసులోని ప్రేమను వ్యక్తపరచలేరు. కానీ.. నేరుగా కాకపోయినా ఓ చిన్న ప్రశంసతోనో, హత్తుకునో మీ మనసు తెలియజేయండి. కష్టంలో, బాధలో... నేనున్నానని ఇచ్చే భరోసా చాలు... మీ అనుబంధం హాయిగా సాగిపోవడానికి. దంపతుల్లో ఒకరు సాధించిన విజయాన్ని మరొకరు మనస్ఫూర్తిగా ప్రశంసిస్తే చాలు మీరెంత ఇష్టపడుతున్నారో అవతలివారికి అర్థమవుతుంది.

చొరవ కావాలి: అప్పుడప్పుడూ చిర్రుబుర్రులాడుకోవడం సహజమే. ఇలాంటప్పుడు సమస్యను సమస్యగానే చూడాలి. అభిప్రాయభేదాలు వస్తే... సున్నితంగా చర్చించండి. పొరబాటు జరిగితే దిద్దుకునే అవకాశం కల్పించండి. ఆపై దాన్ని అక్కడితో వదిలేసి ఎదుటివారిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటే చాలు. సమస్య మంచులా కరిగి, ఆ బంధం మరింత బలపడుతుంది.

సమయం ఇవ్వండి: ఎంత బిజీగా ఉన్నా రోజులో కొంత సమయాన్నైనా భాగస్వామి కోసం కేటాయించాలి. అప్పుడు మాత్రం మూడోవ్యక్తి గురించి సంభాషణ, అనవసరపు చర్చలు, ఫోన్‌లో మునిగిపోవడం వంటివి చేయొద్దు. అలా వీలు చిక్కినప్పుడల్లా చేస్తే మీ అనుబంధం మరింత బలపడుతుంది.

స్పర్శా ముఖ్యమే...

ఎంత బిజీగా ఉన్నా... దంపతులిద్దరూ ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒకరిచేయిని మరొకరు ప్రేమగా స్పృశిస్తే చాలు. అది వారి మనసులను కలుపుతుంది. చిన్నచిన్న సమస్యలెదురైనప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రేమగా అవతలి వ్యక్తిని చేతుల్లోకి తీసుకోవాలి. ఆ స్పర్శ ఎదుటివారికి తనకంటూ ఓ తోడు ఉందనే భావన కలిగిస్తుంది.. ఇరువురి అనుబంధాన్ని పెంచుతుంది. అలాగే అత్యవసరసమయాల్లో భాగస్వామి అడిగే వరకు ఉండకుండా ముందుగానే గుర్తించి చేయూతనందించాలి. అది ఎదుటివారిపై ఉండే ప్రేమను ప్రదర్శించే మార్గమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్