భరోసాతోనే బంధం పదిలం

భార్యాభర్తల మధ్య నమ్మకమే ఆ బంధాన్ని శాశ్వతంగా పదికాలాలపాటు ఉంచుతుంది. ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలంటే ఏం చేయాలో చెబుతున్నారు మానసిక  నిపుణులు.

Published : 25 Oct 2021 02:09 IST

భార్యాభర్తల మధ్య నమ్మకమే ఆ బంధాన్ని శాశ్వతంగా పదికాలాలపాటు ఉంచుతుంది. ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలంటే ఏం చేయాలో చెబుతున్నారు మానసిక  నిపుణులు.

* వివాహబంధంలోకి అడుగుపెట్టే ముందు భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరికి గడిచిన జీవితం చేదు అనుభవాలను మిగిల్చి ఉండొచ్చు. వాటి గురించి ఎదుటివారు భాగస్వామితో నమ్మకంగా చెప్పడానికి ఆసక్తి చూపిస్తే...సహనంతో విని అర్థం చేసుకోవాలి. ఆ సమస్య ప్రభావాన్ని గుర్తించి, అందులో నుంచి వారిని మానసికంగా బయటకు తీసుకురావడానికి నేనున్నానంటూ చేయూతనివ్వాలి. ఏ నమ్మకాన్ని అయితే వారు ఆశించారో దాన్ని అందించగలగాలి. ఇది దంపతుల మధ్య స్నేహబంధాన్ని పెంచుతుంది.

* ఆలుమగల మధ్య నమ్మకాన్ని ప్రేమతోనే సాధించాలి. మూడోవ్యక్తి ప్రమేయంతో సమస్యలు వచ్చినా...వాటిని ఈ నమ్మకంతోనే అధిగమించగలరు. బాధ్యతల్ని పంచుకునేటప్పుడు, సమస్యల పరిష్కారానికీ మీరు మీ భాగస్వామికి సలహాలు ఇవ్వొచ్చు. అయితే అదే సరైనదంటూ ఒత్తిడి చేయొద్దు. ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి. పరిష్కారానికి మీ వంతు చేయూత అందిస్తాననే భరోసా కల్పించండి. అప్పుడే మిమ్మల్ని నమ్మగలరు.

* కష్టనష్టాలు జీవితంలో సహజం. అలాంటివి మీ సంసారంలో ఎదురైతే...ఒకరినే బాధ్యుల్ని చేయొద్దు. వాటిని సద్దుమణిగేలా చేయడానికి, సర్దుకుపోవడానికి మీరు కొంత సహకరించాలి. అప్పుడే మీ సహచర్యంపై నమ్మకం పెరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్